రైళ్లు, రైల్వే ట్రాక్‌లపై పెరుగుతున్న ప్రమాదకరమైన స్టంట్‌లను అరికట్టడానికి రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్‌లకు కఠినమైన ఆదేశాన్ని జారీ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు రకరకాల వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రైళ్లలోనూ, రైల్వే ట్రాక్ లపై ఎక్కువగా చేస్తున్నారు. ఈ క్రమంలో.. రైల్వే బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు లోపల గానీ.. రైలు పట్టాలపై గానీ రీల్స్ చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ మేరకు అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
మణిపూర్‌లో హింస ఆగడం లేదు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా రెండో రోజు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన శాంతిభద్రతలను కాపాడాలని భద్రతా బలగాలు, రాష్ట్ర ఏజెన్సీలకు సూచించారు. రాష్ట్రంలో భద్రత కోసం 50 కంపెనీల అదనపు కేంద్ర పోలీసు బలగాలను షా పంపించారు.
మిచెల్ స్టార్క్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో అతను మెగా వేలంలో ఉండనున్నాడు. అయితే.. ఈసారి స్టార్క్ రికార్డు వేలం కొల్లగొట్టకపోవచ్చునని.. ఇంతకుముందు మెగా వేలంలో స్టార్క్ రికార్డును బద్దలు కొట్టగల ఓ భారతీయ ఆటగాడు ఉన్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.
గాలి కాలుష్యం ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర భారతదేశంలోనే కాకుండా.. పాకిస్తాన్‌లో కూడా బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని రెండు నగరాలు లాహోర్, ముల్తాన్‌లలో పూర్తి లాక్‌డౌన్ విధించారు. తీవ్ర గాలి కాలుష్యం కారణంగా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముల్తాన్ నగరంలో AQI 2000 దాటింది. లాహోర్‌లో AQI 1100 కంటే ఎక్కువగానే కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పంజాబ్ ప్రభుత్వం లాహోర్, ముల్తాన్‌లలో పూర్తి లాక్‌డౌన్ విధించిందని పాక్ మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో ఇకపై 10-12 తరగతులు కూడా ఆన్‌లైన్‌లో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఫిజికల్ మీడియం ద్వారా పాఠశాలకు వెళ్లేవారు. అలాగే.. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
మహారాష్ట్రలోని థానేలో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగు చూసింది. తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి రూ.4 లక్షల కోసం వేధించినందుకు ఓ వ్యక్తితో పాటు అతని కుటుంబానికి చెందిన మరో నలుగురిపై థానే పోలీసులు కేసు నమోదు చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఎక్స్‌లో పోస్ట్‌లో సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని ప్రశంసించారు. 2002 నాటి గోద్రా రైలు దహనం ఘటన ఆధారంగా తీసిన 'ది సబర్మతి రిపోర్ట్' సినిమా నిజాన్ని ధైర్యంగా బయటపెట్టిందని అన్నారు.
హైదరాబాద్ మరొక మెగా టోర్నమెంట్ కు వేదిక కానుంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్‌కు ఆతిధ్యమివ్వబోతుంది. ఇందుకోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఘనంగా ఏర్పాట్లు పూర్తిచేసింది. రేపు (సోమవారం) ఇండియా-మలేషియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.00 గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ ఫుట్ బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024) విజయవంతంగా సాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశమందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే.. 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తయింది. ఆదివారం (నవంబర్ 17) నాటికి 58.3% సర్వే పూర్తయింది.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నయాగామ్, భోకర్, నాందేడ్ ప్రచార సభల్లో ఆయన ఆదివారం ప్రసంగించారు. అబద్ధాల పోటీలు పెడితే దేశంలో నెంబర్ వన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలుస్తారని ముఖ్యమంత్రి విమర్శించారు.