హైదరాబాద్ మరొక మెగా టోర్నమెంట్ కు వేదిక కానుంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్‌కు ఆతిధ్యమివ్వబోతుంది. ఇందుకోసం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఘనంగా ఏర్పాట్లు పూర్తిచేసింది. రేపు (సోమవారం) ఇండియా-మలేషియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.00 గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ ఫుట్ బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ మ్యాచ్ కు ఆతిధ్యం ఇచ్చిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ.. ఇప్పుడు ఇండియా, మలేషియా మధ్య ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తోంది.
Read Also: Mechanic Rocky Trailer 2.0: క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసిన పర్వాలేదు: విశ్వక్ సేన్
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు మ్యూజికల్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నారు. కాగా.. మెగా టోర్నమెంట్ ప్రారంభ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. అయితే.. ఈ తరహా ఫిఫా ఫ్రెండ్లీ కప్ హైదరాబాద్ నగరంలో జరగడం ఇదే మొదటిసారి. ఇక ఈ ఫుట్ బాల్ మ్యాచ్ కోసం నగరంలోని యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఇండియా, మలేషియా మధ్య జరగనున్న ఫిఫా ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్‌ను నవంబర్ 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
Read Also: Samagra Kutumba Survey: 58 శాతం పూర్తయిన ఇంటింటి సర్వే.. అత్యధికంగా ఈ జిల్లాలోనే