CM Revanth Reddy: వీరుల గడ్డలో విద్రోహులు షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్..
- మహారాష్ట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
- నయాగామ్, భోకర్, నాందేడ్ ప్రచార సభల్లో సీఎం ప్రసంగం
- అబద్ధాల పోటీలు పెడితే దేశంలో నెంబర్ వన్‌గా ప్రధాని మోడీ నిలుస్తారు- సీఎం
- యోధులు నేలలో ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్ వంటి విద్రోహులు తయారయ్యారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్రపతి శివాజీ, జ్యోతి బాపూలే, బీఆర్ అంబేడ్కర్, బాలా సాహెబ్, శరద్ పవార్ వంటి యోధులు నేలలో ఇప్పుడు ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్ వంటి విద్రోహులు తయారయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారు గుజరాత్ గులాంలుగా మారారని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నయాగామ్, భోకర్, నాందేడ్ ప్రచార సభల్లో ఆయన ఆదివారం ప్రసంగించారు. అనంతరం సోలాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. అబద్ధాల పోటీలు పెడితే దేశంలో నెంబర్ వన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలుస్తారని ముఖ్యమంత్రి విమర్శించారు. ఆటో డ్రైవర్‌గా ఉన్న ఏక్‌నాథ్ షిండేను మంత్రి వరకు బాలాసాహెబ్ కుటుంబం తీసుకువచ్చిందని.. సొంత కుమార్తెను కాదని అజిత్ పవార్‌ను శరద్ పవార్ ఉప ముఖ్యమంత్రి చేశారని.. అశోక్ చవాన్ ఆయన తండ్రి శంకర్ రావు చౌహాన్‌ను కాంగ్రెస్ పార్టీ.. గాంధీ కుటుంబం ముఖ్యమంత్రులుగా చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
Read Also: Womens Asian Champions Trophy: లీగ్ దశలో జపాన్‌ను ఓడించి అగ్రస్థానంతో సెమీఫైనల్‌కు చేరుకున్న భారత్
Also Read
- Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- 12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
ఆ ముగ్గురు విద్రోహులుగా మారి వీరుల నేలను అవమానాలపాలు చేశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. తెలంగాణలో తమ ప్రభుత్వం 50 రోజుల్లోనే రూ. 18 వేల కోట్లను రైతుల రుణమాఫీకి వారి ఖాతాల్లో వేసిందని తెలిపారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో రుణమాఫీతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రూ.500కే సిలిండర్.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న నయాగామ్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మీనల్ పాటిల్ ఖత్‌గావ్‌కర్, భోకర్ అభ్యర్థి తిరుపతి కదమ్ కొందేకర్, దక్షిణ సోలాపూర్ అభ్యర్థి చేతన్ నరొటే, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చౌహాన్‌లను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Read Also: Minister Narayana: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం
తాజావార్తలు
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!