ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఇప్పటి వరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ ఉన్నాడు. ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 2024 వేలంలో రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే.. స్టార్క్ తోటి ఆటగాడు.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే.. అధిక ధరకు కొనుగోలు చేసిన కేకేఆర్‌కు స్టార్క్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ క్రమంలో మిచెల్ స్టార్క్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో అతను మెగా వేలంలో ఉండనున్నాడు. అయితే.. ఈసారి స్టార్క్ రికార్డు వేలం కొల్లగొట్టకపోవచ్చునని.. ఇంతకుముందు మెగా వేలంలో స్టార్క్ రికార్డును బద్దలు కొట్టగల ఓ భారతీయ ఆటగాడు ఉన్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.
Read Also: Assembly polls: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ముసిగిన ప్రచార హోరు.. ఎల్లుండి పోలింగ్
ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వెంకటేష్ అయ్యర్, ఇషాన్ కిషన్ వంటి దిగ్గజాలు బరిలోకి దిగనున్నారు. ఈ క్రమంలో.. ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘మిచెల్ స్టార్క్ వేలం రికార్డు ప్రమాదంలో ఉంది. దాన్ని బ్రేక్ చేసేందుకు రిషబ్ పంత్ సిద్ధమయ్యాడు.’ అని తెలిపాడు.
Mitchell Starc’s auction record is in danger. @RishabhPant17 is ready to break it!
— Irfan Pathan (@IrfanPathan) November 18, 2024
Read Also: Thandel Bujji Thalli: నవంబర్ 21న వచ్చేస్తోన్న తండేల్ ‘బుజ్జి తల్లి’
రిషబ్ పంత్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఆడాడు. ఈసారి పంత్‌ను రిటైన్ చేయకపోవడంతో వేలంలోకి అడుగుపెట్టబోతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్ కూడా తమ కెప్టెన్‌లను విడిచిపెట్టింది. KL రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వేలంలో ఉండనున్నారు. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో మెగా వేలం జరగనుంది. మెగా వేలం కోసం మొత్తం 574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 366 మంది భారతీయులు, 208 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రూ.2 కోట్ల ప్రాథమిక ధరలో మొత్తం 81 మంది ఆటగాళ్లు ఉన్నారు. మరి ఇర్ఫాన్ పఠాన్ చెప్పిన ఈ అంచనా కరెక్ట్ అవుతుందో లేదో చూడాలి.