ఆదివారం కోయంబత్తూర్‌లో జరిగిన డామినెంట్ షోలో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అఖీల్ అలీఖాన్ సత్తా చాటాడు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు చెందిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ F4 రేస్ టైటిల్ గెలుచుకుంది. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీ ఓనర్‌గా అక్కినేని నాగ చైతన్య ఉన్నారు.
బీజేపీకి ఝార్ఖండ్ ప్రజలపై ప్రేమ లేదు.. ఇక్కడి ఖనిజ సంపదపై కన్ను వేసిందని స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన జార్ఖండ్ రాష్ట్రం బొకారో నియోజకవర్గంలోని శివండి, దుంది బజార్, ఆజాద్ నగర్ తదితర బ్లాక్‌లల్లో ఇండియా కూటమి పక్షాన ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలో మరొక ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది. ఖిలా వరంగల్ మండలంలోని మామునూరులో ఎయిర్ పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం నుంచి పెర్త్‌లో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. ఈ విషయాన్ని రోహిత్ శర్మ బీసీసీఐకి తెలియజేసాడు. అతను ఇటీవలే రెండోసారి తండ్రైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తన కుటుంబంతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. కాగా.. రోహిత్ గైర్హాజరీలో జట్టు వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు.
మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేటీఆర్ పనే అని ఆరోపించారు. కేటీఆర్ వెనక ఉండే దాడి చేయించారు.. అమాయకులను బలి చేస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అధికారులను విదేశాల్లో దాచారని మంత్రి కొండా సురేఖా అన్నారు. బీఆర్ఎస్ ది తుగ్లక్ పాలన.. బీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టిందని దుయ్యబట్టారు.
బీజేపీ చేపట్టిన 'మూసీ నిద్ర' కార్యక్రమంపై తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బీజేపీ నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారని ఆరోపించారు.
తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియత్రించేందుకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోటో షూట్ కోసం మూసీ నిద్ర చేశారని అన్నారు. బస చేసే ముందు ఆ ప్రాంతంలో దోమల మందు, ఈగల మందు కొట్టారు.. మూడు నెలలు అక్కడ ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయని పేర్కొన్నారు.
మరోసారి మణిపూర్ రగిలిపోతుంది. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ క్రమంలో.. శనివారం ముగ్గురు భారతీయ జనతా పార్టీ, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసాలపై దాడి చేశారు. ఆందోళనకారులు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి నిర్మాతగా.. గట్టు నవీన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "కేరాఫ్ రవీంద్రభారతి". జబర్దస్త్ జీవన్, గట్టు నవీన్, నవీన, మాస్టర్ రత్నాకర్ సాయి, ప్రణీత తదితరులు ముఖ్యపాత్రల్లో చేస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఆదివారం నాడు రవీంద్రభారతిలో జరిగాయి.