ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి కీలక అప్‌డేట్స్ వస్తున్నాయి. జనవరిలో భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుందని ఐసీసీ ప్రకటించింది. ఈ ట్రోఫీకి హోస్టింగ్‌తో సంబంధం లేదు.. పెద్ద టోర్నమెంట్‌లకు ముందు ఐసీసీ ఈ ట్రోఫీ పర్యటనను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ నుంచి భారత్‌కు రానుంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
నిరుద్యోగులే వీరి టార్గెట్.. ఫేస్ బుక్‌లో నకిలీ ఫ్రొఫైల్స్‌ను సృష్టించి అబ్బాయిల నుంచి భారీ మొత్తంలో డబ్బులు లాగుతున్నారు. చాలా మంది యువకులు ఈ స్కామ్ లో చిక్కుకుపోయారు. ఈ స్కామ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు, పురుషులను లక్ష్యంగా చేసుకుంటోంది.
ఒలింపిక్ రజత పతక విజేత చైనాను భారత్ 3-0తో ఓడించింది. శనివారం జరిగిన మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అస్థిరత వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో యావత్ ప్రపంచం భారతదేశ రాజకీయ సుస్థిరతపై ఓ కన్నేసి ఉంచుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం మాములు విషయం కాదని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని మెడికల్ కాలేజీ చైల్డ్‌వార్డ్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 16 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. కాగా.. ఈ ఘటనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏడు రోజుల్లోగా తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.
కలబంద వాడకం చర్మానికి ప్రయోజనకరంగా చెబుతారు. కలబంద మన ఇంటి పరిసరాల్లో దొరుకుతుంది. కలబంద వాడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా.. అనేక వ్యాధులను నయం చేసే గుణం దీనిలో ఉంది. కలబంద ఆరోగ్యానికి చాలా మంచి ఔషధంగా పని చేస్తుంది.
ఢిల్లీని వణికించిన తీవ్ర వాయు కాలుష్యం.. ఇప్పుడు హర్యానాకు చేరింది. హర్యానాలో కాలుష్య విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. కేవలం ఆన్‌లైన్ తరగతులు మాత్రమే నిర్వహించనున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు సాధించాడు. కాగా.. ఈ సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. నాల్గవ మ్యాచ్‌లో అజేయంగా 109 పరుగులు చేశాడు. దీంతో.. టీ20 ఫార్మాట్‌లో 2024లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందున్న విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
సౌతాఫ్రికాతో జరిగిన రెండు టీ20ల్లో వరుస సెంచరీలు సాధించి తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. రెండు టీ20ల్లోనూ వరుసగా విజయం సాధించిన భారత జట్టు 3-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. కాగా.. అనంతరం తిలక్ వర్మను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు.
వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్‌లో ఐసీసీ మార్పులు చేసింది. ట్రోఫీ టూర్‌ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో నిర్వహించడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. గ్లోబల్ బాడీ ఆఫ్ క్రికెట్ పీఓకేను చేర్చని సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.