Samagra Kutumba Survey: 58 శాతం పూర్తయిన ఇంటింటి సర్వే.. అత్యధికంగా ఈ జిల్లాలోనే
- విజయవంతంగా సాగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే
- నవంబర్ 6న ప్రారంభమైన సర్వే
- 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తి
- ఆదివారం నాటికి 58.3% సర్వే పూర్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024) విజయవంతంగా సాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశమందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే.. 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తయింది. ఆదివారం (నవంబర్ 17) నాటికి 58.3% సర్వే పూర్తయింది. సర్వేలో ముందుగా నవంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇళ్ల గణనను ప్రభుత్వం చేపట్టింది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించింది. నవంబర్ 9వ తేదీ నుంచి ఇంటింటి వివరాల సర్వే ప్రారంభించింది. మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయింది.
Read Also: Puspa 2 Trailer: ఊహించిన దానికంటే మించి ఉంటుంది: రష్మిక మందన్న
Also Read
నవంబర్ 17 నాటికి సర్వే పూర్తయిన ఇండ్లు:
• గ్రామీణం: 64,41,183
• పట్టణం: 51,73,166
• మొత్తం: 1,16,14,349
బ్లాకులు:
• గ్రామీణం: 52,493
• పట్టణం: 40,408
• మొత్తం: 92,901
ఎన్యుమరేటర్లు:
• గ్రామీణం: 47,561
• పట్టణం: 40,246
• మొత్తం: 87,807
పర్యవేక్షకులు:
• గ్రామీణం: 4,947
• పట్టణం: 3,841
• మొత్తం: 8,788
జిల్లాల వారీగా సర్వే పురోగతిలో ములుగు (87.1% ), నల్గొండ (81.4%) జిల్లాలు ముందంజలో ఉన్నాయి. జనగాం (77.6%), మంచిర్యాల (74.8%), పెద్దపల్లి (74.3%) తర్వాత వరుసలో ఉన్నాయి. జన సాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో 38.3% సర్వే పూర్తయింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో జోరుగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే:
ఇప్పటి వరకు 9,60,656 కుటుంబాల సర్వే పూర్తి చేసింది సిబ్బంది.. సర్వే విధుల్లో మొత్తం 20 వేల మంది ఎన్యుమలేటర్లు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 28 లక్షల 28 వేల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి రోజు దాదాపు లక్ష కుటుంబాల సర్వే పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది జీహెచ్ఎంసీ.ఈ రోజు లక్ష 20 వేల కుటుంబాల సర్వే పూర్తి చేసింది సిబ్బంది. ఒక్కో ఇన్యుమరేటర్ రోజుకు 10 నుండి 15 ఇళ్ల సర్వే పూర్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!