Maharashtra: భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి డబ్బుల కోసం వేధింపులు.. భర్తపై కేసు నమోదు
- మహారాష్ట్రలోని థానేలో ట్రిపుల్ తలాక్ కేసు
- తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి రూ.4 లక్షల కోసం వేధింపులు
- భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని థానేలో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగు చూసింది. తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి రూ.4 లక్షల కోసం వేధించినందుకు ఓ వ్యక్తితో పాటు అతని కుటుంబానికి చెందిన మరో నలుగురిపై థానే పోలీసులు కేసు నమోదు చేశారు. 33 ఏళ్ల ఫిర్యాదుదారు మహిళ నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాది. ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలోని థానే జిల్లాలోని భివాండి ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ ఏడాది జనవరి-జూలై మధ్య నాగ్‌పూర్‌లోని అత్తమామల దగ్గర ఉంటున్నప్పుడు నిందితులు రూ.4 లక్షలు, కారును డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి డిమాండ్లను మహిళ నెరవేర్చలేకపోవడంతో వారు ఆమెను కొట్టి.. తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారని బాధితురాలు చెప్పింది. ఆ తర్వాత తన భర్త తనకు ట్రిపుల్ తలాక్ చెప్పి సంబంధాన్ని విడనాడాడని ఫిర్యాదుదారు ఆరోపించింది.
Read Also: Double Murder: దారుణ ఘటన.. అక్క, 3 నెలల చిన్నారిని హత్య చేసిన తమ్ముడు
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
మహిళ ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు శనివారం ఆమె భర్త, అత్తమామలు.. వారి కుటుంబంలోని మరో ముగ్గురు సభ్యులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85 (ఒక మహిళను క్రూరత్వానికి గురిచేసిన భర్త లేదా భర్త బంధువు) కింద కేసు నమోదు చేశారు. 115(2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 352 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వక అవమానం), 351(2) (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. నిందితులపై ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Bengaluru: అమెజాన్ హెడ్‌క్వార్టర్స్ తరలింపు.. తీవ్ర అసంతృప్తిలో ఉద్యోగులు
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!