గత కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఎక్కువయ్యాయి. తీవ్ర ఒత్తిళ్లతో కూడిన జీవన శైలి, జంక్ ఫుడ్, సరిగా నీళ్లు తాగకపోవడం, డయాబెటిస్, ఆల్కహాల్ అలవాటు వంటివి దీనికి కారణం అవుతున్నాయి. తమకు కిడ్నీ సమస్యలు తీవ్రమయ్యాయని చాలా మంది గుర్తించలేకపోతున్నారు. ఈ క్రమంలో చేసేదేమీ లేక ఇబ్బందులుపడుతూనే ఉన్నారు. ముందే లక్షణాలను గుర్తించగలిగితే.. త్వరగా చికిత్స తీసుకుని, సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బరువు తగ్గాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఎక్కువగా అల్పాహారం తినడం, కడుపు నిండా భోజనం చేయడం మంచిది కాదు. కడుపు కొంచెం ఖాళీగా ఉండే విధంగా రాత్రి భోజనం చేయాలి. తరచుగా ప్రజలు పగటిపూట కొద్దిగా భోజనం చేసి.. రాత్రి ఎక్కువగా తింటారు. రోజు ఇలా తినడం వల్ల మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.. ఊబకాయాన్ని పెంచుతుంది. బరువు విషయంలో రాత్రి భోజనంలో తక్కువగా తినండి. 7 గంటలకే రాత్రి భోజనం చేయాలి.
ఎక్కువ మంది బ్లాక్ కాఫీని తాగడానికి ఇష్టపడతారు. ఈ కాఫీ తాగితే పని ఒత్తిడి తగ్గుతుంది. నీరసం, అలసట నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఉదయాన్నే పరగడుపున ఈ బ్లాక్ కాఫీ తాగితే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. రుచికి కాస్త చేదుగా ఉన్నా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ నివేదిక ప్రకారం.. బ్లాక్ కాఫీలో ఆల్కహాల్ లేని కొవ్వు కాలేయానికి వ్యతిరేకంగా రక్షించే రక్షిత సమ్మేళనాలు ఉన్నాయి.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 కింద.. టీమిండియా నవంబర్ 22 నుండి ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్ స్టేడియంలో జరగనుంది. గతంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరిగేవి.. అయితే ఈసారి ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22 నుండి ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ చూడటానికి ఇండియాలో ఎప్పుడు, ఏ టైంలో చూడాలి.
హైదరాబాద్‌లో మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్‌కు ఆతిధ్యమిచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా-మలేషియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. రసవత్తరంగ సాగిన ఈ మ్యాచ్ డ్రా గా ముగిసింది.
యూపీలో విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ జిల్లాలోని భోజ్‌పూర్ ఖెత్సీ గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లికి ఒకరోజు ముందు గుండెపోటుతో మరణించాడు. అకస్మాత్తుగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ చనిపోయినట్లు చెప్పారు. దీంతో.. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. వధువు ఇంట్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. కాబోయే భర్త మరణవార్త విన్న వధువు అపస్మారక స్థితికి చేరుకుంది.
మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ.. బ్రెజిల్‌లో పర్యటిస్తున్నారు. రియో డీజెనిరోలో జరిగిన జీ-20 సదస్సు నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. హోస్ట్ బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా మోడీకి కరచాలనం చేసి, కౌగిలింతతో స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు చాలా సేపు మాట్లాడుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు ప్రధాని మోడీ భుజంపై చేయి వేసి చాలాసేపు మాట్లాడారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా ఉంది. అధిక కాలుష్యంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను వేర్వేరు సమయాల్లో తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంటాయి.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టయ్యాడు. నివేదికల ప్రకారం.. అన్మోల్‌ను కాలిఫోర్నియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ అధికారులు కొంతకాలం క్రితం అన్మోల్ తమ దేశంలో ఉన్నాడని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో.. ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ అతని అప్పగింత ప్రక్రియను ప్రారంభించిన వారాల తర్వాత కాలిఫోర్నియా పోలీసులు అన్మోల్‌ను అరెస్టు చేశారు.
తమిళనాడు రాష్ట్రం తిరుచెందూర్‌లోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం 25 ఏళ్ల దేవనై అనే ఆలయ ఏనుగు తన కొమ్ముతో దాడి చేసి ఒకరిని చంపింది. ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు దాని షెడ్‌లో జరిగింది. మహౌత్ ఉదయ కుమార్, అతని బంధువు శిశుబాలన్ ఏనుగుకు పండ్లను తినిపిస్తుండగా ఏనుగు ఒక్కసారిగా రెచ్చిపోయి దాడి చేసింది.