Heart Attack: పెళ్లికి ఒకరోజు ముందు గుండెపోటుతో వరుడు మృతి.. వధువు పరిస్థితి..!
- యూపీలో విషాదం
- పెళ్లికి ఒకరోజు ముందు వరుడు గుండెపోటుతో మృతి
- కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు
- విషయం తెలుసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన వధువు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలో విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ జిల్లాలోని భోజ్‌పూర్ ఖెత్సీ గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లికి ఒకరోజు ముందు గుండెపోటుతో మరణించాడు. అకస్మాత్తుగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ చనిపోయినట్లు చెప్పారు. దీంతో.. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. వధువు ఇంట్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. కాబోయే భర్త మరణవార్త విన్న వధువు అపస్మారక స్థితికి చేరుకుంది.
Read Also: Naga Chaitanya Wedding Card: శుభ లేఖలను పంచుతున్న అక్కినేని ఫ్యామిలీ.. శుభలేఖను చూసారా?
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
22 ఏళ్ల శివంకు ఆగ్రాలోని బని సింగ్ కుమార్తెతో ఈ రోజు వివాహం జరగాల్సి ఉంది. అయితే ఆదివారం అర్థరాత్రి పెళ్లి సందర్భంగా ఓ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా.. శివం మహారాజా కుర్చీపై కూర్చున్నాడు. అయితే.. ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి అందులో నుంచి కింద పడిపోయాడు. ఇది చూసి కుటుంబీకులు, బంధువులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
Read Also: Modi- Lulada Silva: ప్రధాని మోడీ భుజంపై చేయి వేసి మాట్లాడిన బ్రెజిల్ అధ్యక్షుడు.. (వీడియో)
జిల్లా ఆసుపత్రిలో శివం మరణించినట్లు ప్రకటించినప్పటికీ, ఆశతో అతని కుటుంబం అలీగఢ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా డాక్టర్ చనిపోయినట్లు చెప్పాడు. దీంతో.. కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో.. వరుడు మరణంతో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఆగిపోయాయి. వరుడి మృతి విషయం తెలుసుకున్న వధువు కుటుంబీకులు కూడా షాక్‌కు గురయ్యారు. పెళ్లికి వచ్చిన బంధువులు దుఃఖంలో కూరుకుపోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!