APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APTRANSCO Recruitment: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTRANSCO) శుభవార్త తీసుకవచ్చింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 200 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జులై 20, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలలోకి వెళితే.. మొత్తం 200 పోస్టుల్లో ఎలక్ట్రికల్ 167, సివిల్ – 23, టెలికాం 10 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను జోన్ల వారీగా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో BE లేదా B.Tech పూర్తి చేసి ఉండాలి. 2026 జులై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
Also Read
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా జరుగుతుంది. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం మెరిట్ జాబితా రూపొందించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్, క్యారెక్టర్ వెరిఫికేషన్ తర్వాత నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు మొదటి రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో నెలకు రూ.75,000 స్థిర వేతనం చెల్లిస్తారు. ఆపై రూ.86,245 నుంచి రూ.2,08,915 వరకు రెగ్యులర్ పే స్కేల్ వర్తిస్తుంది.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 30న ప్రారంభమైంది. దరఖాస్తుల చివరి తేదీ జులై 20. హాల్ టికెట్లు పరీక్షకు 7 రోజుల ముందు విడుదల కానున్నాయి. ఆన్లైన్ పరీక్షలు ఆగస్టు 22 నుంచి 29 మధ్య నిర్వహించనున్నారు. మెరిట్ జాబితా సెప్టెంబర్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థులు రూ.1,000 దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అభ్యర్థులు అధికారిక రిక్రూట్మెంట్ పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు పూర్తి చేయాలి.
అధికారిక వెబ్సైట్: https://apvidyutrecruitment.apcfss.in
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!