5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lava Virat V1 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) నుండి కొత్త విరాట్ (Virat) సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా Lava Virat V1 5G, Lava Virat V1 4G స్మార్ట్ఫోన్లను జూలై 21 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రెండు ఫోన్లు కొత్త ‘విరాట్’ లైనప్‌లో తొలి మోడళ్లుగా మార్కెట్లోకి రానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ కు సంబంధించి ఓ ప్రత్యేక మైక్రోసైట్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులోకి తీసుకవచ్చారు కూడా…
కంపెనీ ఇప్పటికే Virat V1 సిరీస్ డిజైన్‌ను రివీల్ చేసింది. లావా Virat V1 4Gలో స్క్వేర్ ఆకారంలో డ్యూయల్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉండగా.. లావా Virat V1 5Gలో ప్రత్యేక డిజైన్‌తో డ్యూయల్ కెమెరా సెటప్, LED ఫ్లాష్ ఇవ్వనున్నారు. రెండు ఫోన్లలోనూ ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్ ఉండగా.. 5G వేరియంట్ వెనుక భాగంలో ప్రత్యేక ప్యాటర్న్ డిజైన్ కనిపించనుంది. ఈ రెండు మొబైల్స్ ఫోన్లు బ్లూ, గోల్డ్ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉండనున్నాయి.
Also Read
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
ఈ రెండు స్మార్ట్ఫోన్లలో కూడా USB Type-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ కటౌట్‌ను అందిస్తున్నారు. లావా విరాట్ V1 4Gలో 13MP ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు LED ఫ్లాష్ ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. డిజైన్ పరంగా ఈ ఫోన్ ఇటీవల విడుదలైన లావా స్మార్ట్ 4 ప్లస్ ను పోలి ఉంది. ఆ ఫోన్ ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్లు, ప్రాసెసర్, బ్యాటరీ, డిస్ప్లే, ధర వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. జూలై 21న జరిగే లాంచ్ ఈవెంట్లో పూర్తి వివరాలు ప్రకటించనుంది. ఈ సిరీస్ బడ్జెట్ సెగ్మెంట్లో మిగితా కంపెనీలకు పోటీ ఇవ్వనుంది.
17 years of trust. Where legacy meets design.
For India's endless dreams. A smartphone you can trust. 🤝
A new chapter begins with Virat V1 5G.
Launching on 21st July, 12 PM. Only on Flipkart.#ComingSoon #Flipkart #LavaMobiles #ProudlyIndian #Shaqhataolavauthao pic.twitter.com/GqVFmqiRbp
— Lava Mobiles (@LavaMobile) July 11, 2026
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..