Raaka: ‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?.. మొత్తం బడ్జేట్ తెలిస్తే షేక్ కావాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రాకా’ (Raaka). ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక క్రేజీ చర్చ నడుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.800 కోట్లకు పైగానే ఉండొచ్చనే ప్రచారం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే ఈ సినిమాకు అల్లు అర్జున్ దాదాపు రూ.200 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సమాచారం కూడా అధికారికంగా ధృవీకరించలేదు. అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న భారీ అంచనాల కారణంగా ఈ వార్తలు బన్నీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
అట్లీ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారని సమాచారం. అలాగే ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆగస్టు నెలలో ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవుతుందనే వార్తలు కూడా జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఈ గ్లింప్స్ కేవలం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అల్లు అర్జున్‌కు ఉన్న గ్లోబల్ క్రేజ్ దృష్ట్యా ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. గ్లింప్స్ రిలీజ్‌పై ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల గురించి మేకర్స్ నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
Also Read
- Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
తాజావార్తలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!