IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
- వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టిన భారత్
- మంగళవారం బర్మింగ్‌హామ్ వేదికగా తొలి వన్డే
- మొదటి వన్డే ప్లేయింగ్ 11 ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Playing 11 vs ENG 1st ODI: ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఘోర పరాజయం అనంతరం భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. మంగళవారం (జూన్ 14) బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌లో ఎదురైన పరాజయాలను మరచి.. విజయంతో పునరాగమనం చేయాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ స్టార్ ఆటగాళ్లు, ముగ్గురు మొనగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తిరిగి రావడం భారత జట్టుకు బలంగా మారింది. మొదటి వన్డే ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ 238 పరుగులు, రోహిత్ 143 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఈ జోడీ భారత్‌కు శుభారంభం అందిస్తుందనే నమ్మకంతో జట్టు మేనేజ్మెంట్ ఉంది. గాయం కారణంగా అఫ్గానిస్థాన్ సిరీస్‌కు దూరమైన కింగ్ విరాట్ కోహ్లీ పూర్తిగా కోలుకున్నాడు. విరాట్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్.. వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడనున్నాడు. కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా చేపట్టనున్నాడు. అఫ్గానిస్థాన్ సిరీస్‌లో రాహుల్ 139 పరుగులతో ఆకట్టుకున్నాడు.
Also Read
- Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
- Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
- CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీతో భారత బౌలింగ్ దళం పటిష్టంగా మారింది. అతడితో పాటు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఆల్‌రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డి జట్టులో ఉంటాడు. నితీష్ పేస్ బౌలింగ్ వేస్తాడు కాబట్టి.. భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇషాన్ కిషన్ కూడా అందుబాటులోనే ఉన్నాడు. స్పిన్ బాధ్యతలను అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చూసుకుంటారు. టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ ఇద్దరూ వన్డేల్లో తమ ప్రభావాన్ని చూపించాలని భావిస్తున్నారు. టీ20 సిరీస్‌లో ఎదురైన వైఫల్యాల తర్వాత ఈ వన్డే సిరీస్ భారత జట్టుకు కీలక పరీక్షగా మారింది. సీనియర్ ఆటగాళ్ల అనుభవం, బలమైన బ్యాటింగ్, పటిష్టమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌పై సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని టీమిండియా చూస్తోంది.
తొలి వన్డేకు భారత తుది జట్టు (అంచనా):
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
శ్రేయస్ అయ్యర్
కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్)
నితీష్ కుమార్ రెడ్డి/ఇషాన్ కిషన్
అక్షర్ పటేల్
కుల్దీప్ యాదవ్
అర్ష్‌దీప్ సింగ్
జస్ప్రీత్ బుమ్రా
గుర్నూర్ బ్రార్
భారత వన్డే జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి*, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (WK), ఇషాన్ కిషన్ (wk), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిదీప్, బుమ్రా, హర్షిద్ క్రిష్ణ.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?