తమిళనాడు రాష్ట్రం తిరుచెందూర్‌లోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం 25 ఏళ్ల దేవనై అనే ఆలయ ఏనుగు తన కొమ్ముతో దాడి చేసి ఒకరిని చంపింది. ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు దాని షెడ్‌లో జరిగింది. మహౌత్ ఉదయ కుమార్, అతని బంధువు శిశుబాలన్ ఏనుగుకు పండ్లను తినిపిస్తుండగా ఏనుగు ఒక్కసారిగా రెచ్చిపోయి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. చికిత్స పొందుతూ మహౌత్ ఉదయ కుమార్ బంధువు మృతి చెందాడు.
Read Also: Pakistan: సోషల్ మీడియాలో పాక్ నటి ప్రైవేటు వీడియో లీక్.. ఖండించిన మథిర
కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తిరుచెందూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆలయ నిర్వాహకులు కూడా ప్రదేశాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేసి తదుపరి చర్యలు తీసుకున్నారు. తిరుచెందూర్‌లోని మురుగన్ ఆలయంలో అంతర్భాగమైన దేవనై అనే ఏనుగు.. కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో ఉంటోంది. పండుగల సమయంలో ఈ ఏనుగును ఆభరణాలతో అలంకరించి పూజలు చేస్తారు.
Read Also: Reels: రైలు లోపల, ట్రాక్‌లపై రీల్స్ చేస్తే జైలుకే..! ఆదేశాలు జారీ
అయితే.. ఆలయ ఏనుగులు ఇలా దాడి చేయడం మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేరళలోని వైకోమ్‌లోని టీవీ పురం శ్రీరామ స్వామి ఆలయంలో జరిగిన వేడుకలో పుతుపల్లికి చెందిన మహౌత్ అరవింద్ అనే వ్యక్తి.. కుంజులక్ష్మి అనే ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే వైద్యసేవలు అందించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు.