Tollywood : సింగిల్ థియేటర్స్ మూత పడడానికి స్టార్ హీరోలే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగిల్ థియేటర్స్ మూత పడిపోవడానికి స్టార్ హీరోలే కారణం అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. థియేటర్స్‌లో ఆక్యుపెన్సీ పడిపోయిందంటే తప్పంతా పెద్ద హీరోలదే. పెద్ద హీరో ఏడాదికోసారి కనిపించినా చాలు, ఏడాది మొత్తం థియేటర్స్ కలకళలాడిపోతాయి. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తారే కానీ, అనుకున్న టైమ్‌కు వెళ్లే సినిమాలు మొదలు కాదు, పూర్తి కాదు. ‘కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ’, ‘హై టెక్నికల్ మేకింగ్’ అంటూ రెండు మూడేళ్లు గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది స్టార్స్ సినిమాలు రెండు మూడేళ్లకు ఒకసారి రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువ టైమ్ తీసుకొని, ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయన్న మూఢ నమ్మకంతో పెద్ద హీరోలు ఉన్నారు.
కథలో దమ్ముంటే, మేకింగ్‌తో ఆకట్టుకుంటే ఐదారు నెలల్లో తీసిన సినిమాలు కూడా భారీ లాభాలు తీసుకొస్తాయి. క్రేజీ స్టార్స్ ఏడాదికి రెండు సినిమాలతో వస్తే సినిమా ఇండస్ట్రీ కలకళలాడుతుందని నిర్మాతలు చెబుతున్నా, వీళ్ళ వైఖరి మాత్రం మారడం లేదు. క్యాలెండర్లో సంవత్సరాలు గడిచిపోతున్నా బన్నీ మాత్రం స్లో మోషన్‌ను వీడటం లేదు. ‘పుష్ప’ వచ్చిన మూడేళ్లకు ‘పుష్ప 2’ తో వచ్చాడు. ‘పుష్ప 2’ 2024 డిసెంబర్లో విడుదల కాగా, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాకా’ 2026 లో రావడం లేదు. ఈ లెక్కన 2025 తో పాటు 2026 ను కూడా మిస్ చేసుకున్నట్లే.
Also Read
ఎన్టీఆర్ కూడా ఈ ఏడాది కనిపించడు. ఆయన తొలి హిందీ సినిమా ‘వార్ 2’ 2025 ఆగస్టులో రిలీజ్ అయింది. స్ట్రెయిట్ తెలుగు మూవీ రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. 2024 సెప్టెంబర్‌లో ‘దేవర’ రిలీజ్ కాగా, ఏడాది నుంచి ‘డ్రాగన్’ షూటింగ్ లో ఉన్నాడు. ఈ ఏడాదే రిలీజ్ కావలసిన ‘డ్రాగన్’ షూటింగ్ ఆలస్యమై 2027 జూన్ 11న థియేటర్స్ లోకి వస్తుంది. ఇలా తారక్ ఈ ఏడాది కనిపించడు. అలా హీరోలు అందరూ లేటుగా సినిమాలు చేస్తుంటే ఆ ఎఫెక్ట్ థియేటర్ల మీద పడుతోంది అని చెప్పక తప్పదు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!