Rajesh Veeramalla
Author- NTV Telugu-
MP Balram Naik: కాంగ్రెస్ గ్యారంటీలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదు..
బీఆర్ఎస్ హయాంలో మహబూబాబాద్‌లో గిరిజనుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్‌కు రావాలని ఎంపీ బలరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. లగచర్ల ఘటన బీఆర్ఎస్ పార్టీ కుట్రతో చేయించిందని.. అందులో ఏడుగురికి భూములు లేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని దుయ్యబట్టారు. -
CM Revanth: మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుడ్ పాయిజన్.. సీఎం సీరియస్
నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. -
Hyderabad: రేపు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు..
రేపు హైదరాబాద్‌లో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 4.30 నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్ పోటీ పడుతున్నారు. -
Bribe: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అసిస్టెంట్ కమిషనర్..
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. హైదరాబాద్‌లోని నాంపల్లి, గగన్ విహార్ 11వ అంతస్తులో ఏసీబీ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈ క్రమంలో.. మలక్‌పేట్-II సర్కిల్‌కు చెందిన కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ మహబూబ్ బాషా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రూ. లక్ష డిమాండ్ చేసి 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. -
Ragging: నల్గొండ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం..
నల్గొండ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ర్యాగింగ్ ఘటనపై పై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మీడియాలో వరస కథనాల ద్వారానే ర్యాగింగ్ విషయం తెలిసిందని నేషనల్ మెడికల్ కౌన్సిల్ లేఖలో పేర్కొంది. అసలు కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా లేదా అని ప్రశ్నించింది. -
Womens Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతగా భారత్..
భారత అమ్మాయిల హాకీ జట్టు అదరగొట్టింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి అనేది ఎరుగకుండా టైటిల్‌ను కైవసం చేసుకుంది. బుధవారం ఫైనల్‌లో 1-0తో చైనాను చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. దీపిక 31వ నిమిషంలో గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. దీంతో.. ఆసియా మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. -
Hyderabad: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం..
విదేశీ ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్న సైబర్ నేరగాళ్లు.. అమాయక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారి దగ్గర సాఫ్ట్ వేర్ జాబ్ అంటూ డబ్బులు తీసుకొని విద్యార్థులు మంచిగా నటిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడి భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జయ నగర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసానికి పాల్పడ్డారు. -
Madhu Yashki Goud: దేశంలో ఆర్ఎస్ఎస్‌ను సేవాదళ్ ధీటుగా ఎదుర్కొంది..
హైదరాబాద్ గాంధీ భవన్‌లో సేవాదళ్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. సేవాదల్ అధ్యక్షులు జితేందర్ అధ్యక్షతన ఈ ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత సేవాదళ్ అధ్యక్షులు లాల్జ్ జి దేశాయ్, ఎంపీ అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు కేశవ రావు, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు. -
ICC T20 Rankings: నెంబర్-1 ఆల్ రౌండర్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం టీ20 ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నెంబర్-1 స్థానంలోకి అడుగుపెట్టాడు. హార్దిక్ మరోసారి టీ20 ఆల్‌రౌండర్‌గా నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టోన్, నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీలను వెనక్కినెట్టి నెంబర్ వన్‌కు ఎగబాకాడు. హార్దిక్ ప్రస్తుతం 244 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. -
CMR Shopping Mall: మచిలీపట్నంలో ఘనంగా సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్ మచిలీపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం 09:42 గంటలకు గనులు, భూగర్భ శాస్త్ర మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ రావు, మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, కార్పొరేటర్, పలువురు నేతలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
iQOO 16: ఐకూ 16 వచ్చేస్తోంది.. 8,500mAh భారీ బ్యాటరీ, Snapdragon ఫ్లాగ్షిప్ చిప్‌తో అదిరే ఫీచర్లు!
-
Gautam Gambhir: టీ20 వరల్డ్‌కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
-
Lenin 3 days collection : లెక్క మారింది.. అఖిల్ 2.O మాస్ బ్యాటింగ్
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
ట్రెండింగ్
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!