Roasted Almonds: కాల్చిన బాదంపప్పును తినండి.. ఈ సమస్యలకు గుడ్ బై చెప్పండి
- బాదంపప్పు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఆహారం
- బాదం పప్పు పౌష్టికాహారంలో శక్తివంతమైన మూలకం
- బాదం పప్పు తినడం ద్వారా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు
- కాల్చిన బాదం పప్పు వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాదంపప్పు తినడం అందరికీ అలవాటు ఉంటుంది. బాదం పప్పులో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది తినడం ద్వారా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కాల్చిన బాదం పప్పు వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా..? మెదడుకు పదును పెట్టడం నుండి ఎముకలను బలోపేతం చేయడం వరకు.. కాల్చిన బాదం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఏయే వ్యక్తులు ఎక్కువ ప్రయోజనం పొందుతారో.. ఒక నెల రోజుల పాటు రోజూ ఆహారంలో వేయించిన బాదంపప్పులను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదలలు పొందవచ్చో తెలుసుకుందాం..
Read Also: AP Capital: ముగిసిన సీఆర్డీఏ సమావేశం.. కీలక నిర్మాణాలకు అనుమతి..
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
చెడు కొలెస్ట్రాల్‌ను వదిలిస్తుంది:
కాల్చిన బాదంపప్పులను తినడం వల్ల హై డెన్సిటీ లిపోప్రొటీన్ (హెచ్‌డిఎల్) అంటే మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బాదంపప్పులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండె ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలకు కూడా ప్రసిద్ధి చెందాయి. ఇది తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.. HDLని కూడా ప్రోత్సహిస్తుంది.
ఎముకల ఆరోగ్యం:
ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల నుంచి కూడా రక్షిస్తాయి. బాదంపప్పులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఇతర ముఖ్యమైన పోషకాలు ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడతాయి. దీంతో.. ఎముకలు దృఢంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి.
బీపీని నియంత్రిస్తుంది:
వేయించిన బాదం బీపీ పేషెంట్లకు చక్కని అల్పాహారం. వీటిలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. డాక్టర్ సలహా ప్రకారం, బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనేక ఇతర ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలను కూడా అందించవచ్చు.
ఆరోగ్యకరమైన చర్మం:
బాదంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది ముడుతలను తగ్గించి, చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అంతే కాకుండా.. అవి చర్మాన్ని లోపలి నుండి పోషించి ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో.. మీ చర్మం సహజంగా మెరుస్తూ ఉంటుంది. అందువల్ల వేయించిన బాదం తినడం చర్మ సంరక్షణకు గొప్ప ఎంపిక.
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!