లండన్‌లో నివసిస్తున్న 24 ఏళ్ల భారతీయ యువతి హర్షిత బరేలా హత్యకు గురైంది. నవంబర్ 14న ఆమె మృతదేహాన్ని కారు ఢిక్కీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. తన కూతురు హత్యపై తల్లి సుదేష్ కుమారి మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త తనను చంపేస్తానని తన కూతురు కొన్ని వారాల క్రితమే చెప్పిందని తెలిపింది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు చేసింది. 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది.
ప్రముఖ బైక్ కంపెనీ కవాసకి ఇండియా.. తన నింజా లైనప్‌పై డిసెంబర్ 2024లో బంపర్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ భారతీయ మార్కెట్లో మూడు నింజా బైక్‌లపై తగ్గింపు ఆఫర్‌లను అందిస్తోంది. ఈ తగ్గింపు ఆఫర్ కింద కవాసకి నింజా 500, కవాసకి నింజా 300, కవాసకి నింజా 650పై వేల రూపాయల తగ్గింపుతో అందజేస్తున్నారు.
చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. చల్లని గాలి, తక్కువ తేమ చర్మానికి హాని కలిగిస్తాయి. ఈ క్రమంలో అలోవెరా జెల్ ఒక గొప్ప ఎంపిక. కలబందలో సహజంగా ఉండే పోషకాలు చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా చేస్తాయి. అంతేకాకుండా.. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి.
దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ యూనివర్సిటీలో 137 నాన్ టీచింగ్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరిగింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 11, సీనియర్ అసిస్టెంట్ 46, అసిస్టెంట్ 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 21 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అన్‌రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్‌లో జరుగుతోంది. రెండో రోజు తొలి సెషన్ టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా రాణించింది. తొలి సెషన్‌లో టీమిండియా 29.4 ఓవర్లు బౌలింగ్ చేసి 76 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసింది. మూడు వికెట్లలో జస్ప్రీత్ బుమ్రాకు రెండు వికెట్లు లభించగా, నితీష్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టాడు. అయితే రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఇద్దరు బీహార్‌కు చెందిన కూలీలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని పోలీసులు హతమార్చారు. శనివారం సాయంత్రం కక్చింగ్ జిల్లాలో ఇద్దరు కార్మికులను కాల్చి చంపారు.
నేడు మహారాష్ట్రలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. రాజ్‌భవన్‌లోని ప్రాంగంణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కోల్‌కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో ఒక చెత్త కుప్పలో కట్ చేసి ఉన్న మహిళ తల లభ్యమైంది. కాగా.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు తన బావని 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అతిఉర్ రెహమాన్ లస్కర్‌గా గుర్తించారు.
2026 మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. 'అజెండా ఆజ్ తక్' కార్యక్రమంలో షా మాట్లాడుతూ.. నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అభివృద్ధిని అడ్డుకున్నదని అన్నారు.