Telangana assembly meetings on day 6: భూభారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంపై అక్బరుద్దీన్, కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో బీఆర్ఎస్‌పై అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల కోసమా..? కుటుంబం కోసం పోరాటం చేస్తున్నారా? అని దుయ్యబట్టారు. తాము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని అక్బరుద్దీన్ అన్నారు. మీ కుటుంబం కోసం అసెంబ్లీలో పోరాటం ఏమిటి..? అని ప్రశ్నించారు. ముమ్మాటికీ ధరణిలో అక్రమాలు జరిగాయి.. ధరణి కేవలం కేసీఆర్ కుటుంబం కోసం తీసుకొచ్చారని ఆరోపించారు. 10 ఏళ్ళు తెలంగాణలో కచరా గవర్నమెంట్ ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల కోసం వచ్చారా…? లేక కేసీఆర్ కుటుంబం కోసం వచ్చారా..? అక్బరుద్దీన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అవసమైతే సభ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయండి.. అసెంబ్లీలో సభ్యులు అనుసరించే వ్యూహం ఇదేనా…? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పాలని అక్బరుద్దీన్ తెలిపారు.
Read Also: YCP-Visakha Dairy: వైసీపీకి విశాఖ డెయిరీ ఛైర్మన్ రాజీనామా!
బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు ప్రజల గొంతు నొక్కేశారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తమ గొంతు నొక్కే అధికారం మీకు ఎవరిచ్చారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎవరిని మాట్లాడనివ్వలేదు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరిని మాట్లాడనివ్వడం లేదని తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డిని 5 నిమిషాలు కూడా మాట్లాడనిచ్చేవారు కాదని అన్నారు. తాము అనుకున్నట్లుగానే సభ నడవాలని బీఆర్ఎస్ అనుకుంటోంది.. సభలో బీఆర్ఎస్ సభ్యుల తీరు బాగోలేదని కూనంనేని పేర్కొన్నారు.
Read Also: KTR Petition: ఏసీబీ కేసు.. కేటీఆర్ పిటిషన్ కాపీలో పేర్కొన్న అంశాలు ఇవే..