Ex Minister KTR Reacts On Formula E Race Case: తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీలో 14 రంగాలు పెట్టుబడి తీసుకొచ్చేవిగా గుర్తించి ప్రాధాన్యత ఇచ్చామని కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఫార్ములా ఈ వాళ్లకు రేస్ కోసం అడిగాం.. ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా హైదరాబాద్‌ను మార్చాలనుకున్నామని తెలిపారు. వాళ్లు రాలేమని అన్నారు, ఒప్పించేందుకు చాలా ప్రయత్నించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 25-10-2022 రోజున తొలి ఒప్పందం చేసుకున్నాం.. ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌లో భాగంగా గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏస్ జెన్‌తో ఒప్పందం చేసుకున్నామని కేటీఆర్ చెప్పారు. గ్రీన్ కో అనే ప్రైవేటు సంస్థ రూ. 110 కోట్ల వరకు ఖర్చు పెట్టింది.. ప్రభుత్వానికి వివిధ రూపాల్లో రూ.550 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వానికి లాభం వచ్చింది.. కానీ తమకు లాభం రాలేదని గ్రీన్ కో అనే ప్రైవేటు సంస్థ వెనక్కు వెళ్లిందన్నారు. మనం నాలుగేళ్లు అగ్రిమెంట్ చేశాము.. ఇప్పుడు ఏమి చేద్దాం అని అరవింద్ కుమార్ తన దగ్గరకు వచ్చాడని కేటీఆర్ తెలిపారు.
Speaker Ayyanna Patrudu: దొంగ పెన్షన్లతో ప్రభుత్వానికి నెలకు రూ.120 కోట్ల నష్టం..!
ఇంకా ఎవరైనా కొత్త ప్రమోటర్ వస్తాడు ఏమో అని వెతికాం.. 3 ఆగస్టు 2023 రోజున తనకు ఒక మెయిల్ వచ్చిందని కేటీఆర్ తెలిపారు. రేసింగ్ పెడతారా లేదా అని అడిగారు.. లేకుంటే క్యాన్సిల్ చేస్తాం అన్నారన్నారు. దీనితో ప్రభుత్వం నుంచి రూ.55 కోట్లు పెడదాం అన్నాను.. రెండు ఇంస్టాల్‌మెంట్స్‌లో డబ్బులు పంపించామన్నారు. 25 సెప్టెంబర్ ఒకే చేసాను.. అక్టోబర్ 5, అక్టోబర్ 11న రెండు సార్లు డబ్బులు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. 29 నవంబర్‌లో ఎన్నికలు జరిగాయి.. డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. డిసెంబర్ 13న ఫార్ములా ఈ రేసింగ్ ప్రమోటర్ ఆల్బట్టో రేవంత్ రెడ్డిని కలిశారని కేటీఆర్ చెప్పారు. ఆ మీటింగ్‌లో దాన కిషోర్ కూడా ఉన్నారని తెలిపారు. 19 డిసెంబర్ న ఒక ఈ మెయిల్ రాశారు.. 21 డిసెంబర్ వరకు రేసింగ్ చేస్తారా లేదా అని అడిగారు.. 23 డిసెంబర్ న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం అని లేఖ రాశారన్నారు. రెండుసార్లు పంపిన డబ్బులు వచ్చాయి.. కానీ మూడో ఇంస్టాల్‌మెంట్ కట్టలేదు అని లేఖ రాశారన్నారు.
Bandi Sanjay: కాంగ్రెస్ సైతం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోంది.. బీఆర్ఎస్ను మించి అప్పులు
రెండు సార్లు డబ్బులు ముట్టాయి అని ఫార్ములా ఈ లీగల్ వాళ్ళు క్లియర్‌గా లేఖ రాశారు.. హెచ్ఎండీఏ నుంచి డబ్బులు పంపాము.. తమకు ముట్టాయి అని రేసింగ్ వాళ్ళు చెప్పారని కేటీఆర్ తెలిపారు. లైసెన్స్ ఫీజ్ వెనక్కి పంపుతాం అంటున్నా.. మీరు తీసుకోవట్లేదు.. ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రభుత్వం చెప్పట్లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందులో ఏసీబీ కేస్ పెట్టడానికి ఏముంది.. కరప్షన్ లేనప్పుడు ఏసీబీ ఎక్కడుందన్నారు. తన మీద కేసులు పెట్టి సతాయిస్తే భయపడమని కేటీఆర్ అన్నారు. తమ వెంట్రుక కూడా పీకలేరని హెచ్చరించారు. ఏసీబీ వాళ్లకు కూడా అన్ని విషయాలు చెబుతానన్నారు. తాను ఉద్యమ నేత బిడ్డనని.. తాను అసలు భయపడనని కేటీఆర్ అన్నారు. తన మీద కేస్ వేస్తే ఫార్ములా ఈ మీద కూడా కేస్ వేయాలి.. వాళ్ళ మీద కేస్ వేస్తే ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పరువు పోతుందని కేటీఆర్ తెలిపారు.