Relief for KTR in High Court: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట లభించింది. పదిరోజులు(ఈనెల 30) వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ కేసులో విచారణ జరపాలని ఆదేశించింది. అలాగే.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. కాగా.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా-ఈ రేసు విషయంలో ఏసీబీ కేసును వ్యతిరేకిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడించింది.
Read Also: Court: భార్యకు రూ2లక్షల మధ్యంతర భృతి ఇవ్వాలని తీర్పు.. భర్త ఏం చేశాడంటే..!
హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ వాడీవేడిగా జరిగింది. కేటీఆర్ తరపు లాయర్, ప్రభుత్వ తరపు లాయర్ మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఈ క్రమంలో.. కేటీఆర్‌ను అరెస్ట్ చేయకుండా ఏసీబీని ఆదేశించండని కోర్టుకు కేటీఆర్ లాయర్ తెలిపారు. ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వండని కోరారు. మరోవైపు.. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ.. ఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతుంది.. ప్రతి విషయం ఎఫ్ఐఆర్ లో ఉండదని అన్నారు. దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గతమవుతాయని తెలిపారు. ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైంది.. రెండు నెలల క్రితం MAUD చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేశారు.. విచారణకు గవర్నర్ కూడా అనుమతించారని ప్రభుత్వ తరపు లాయర్ పేర్కొన్నారు. దానికి సంబంధించిన పేపర్లు ఉన్నాయా అని జడ్జ్ అడిగారు.
Read Also: Strange Thief: అదేం ఆనందమో..! మహిళల జాకెట్లు మాయం చేస్తున్న దొంగ..
దర్యాప్తులో ఈ కేసులో భాగస్వామ్యులైన వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని ఏజీ అన్నారు. విదేశీ కంపెనీకి ప్రజధనం బదిలీ అయ్యింది.. ఈ ఏడాది నిర్వహించాలనుకున్న ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసమే చెల్లింపులు జరిగాయని ఏజీ తెలిపారు. ఇది అత్యవసర పిటిషన్ విచారణ కాదని ఏజీ పేర్కొన్నారు. FEOకు డబ్బుల చెల్లింపులో అక్రమాలు జరిగాయి.. హెచ్ఎండీఏ ఇందులో భాగస్వామి కాకున్నా 55 కోట్లు చెల్లించిందన్నారు. ఇందులో కేటీఆర్‌కు ఎలాంటి లబ్ది చేకూరిందని ఏజీని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎవరెవరికి ఎలాంటి లబ్ది చేకూరిందనేది దర్యాప్తులో తేలుతుందని ఏజీ తెలిపారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తు మాత్రం కొనసాగించవచ్చని తెలిపింది.