Abhishekam and Padipuja of Ayyappa Swamy under the auspices of Pranava Group: ప్రణవ గ్రూప్ ఆధ్వర్యంలో హస్తినాపురం ఈస్ట్ క్రెస్ట్‌లో అయ్యప్ప స్వామి అభిషేకం, పడిపూజ ఘనంగా నిర్వహించారు. గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ గురువారం అంగరంగ వైభవంగా మంగళవాయిద్యాల మధ్య కొనసాగింది. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజ తరువాత పంచామృతాభిషేకం.. కుంకుమ, చందన పసుపు బస్మాభిషేకాలను చేశారు. మహా మంగళ హారతితో పూజా కార్యక్రమాలు ముగిశాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి భారీగా అయ్యప్ప మాలధారణ భక్తులు హాజరై అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తుల పాటలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ పూజలో ప్రణవ గ్రూప్ ఛైర్మన్ బూరుగు రవి కుమార్, ఎక్సూటివ్ డైరెక్టర్ బూరుగు రాంబాబు.. బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురు స్వామి, బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ గురు స్వామి, బండారి అశోక్ గుప్తా విరమలయ గుప్తా, బల మలయ గుప్తా, శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.