KTR case trial in High Court.. Lunch motion petition on ACB case: హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ కొనసాగుతుంది. ఏసీబీ కేసుపై కేటీఆర్ లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. కేటీఆర్ తరపున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవని లాయర్ పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ పై కేసు నమోదు చేశారంటూ లాయర్ తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వల్ల హైదరాబాద్‌కు ప్రయోజనమే కలిగిందని లాయర్ అన్నారు. స్పాన్సర్ తప్పుకోవడం వల్ల హెచ్ఎండీఏ ద్వారా FEO కు చెల్లింపులు జరిగాయని కేటీఆర్ లాయర్ కోర్టుకు చెప్పారు.
Read Also: Atul Subhash Case: మనవడి కోసం సుప్రీంకోర్టుకి అతుల్ సుభాష్ తల్లి..
KTR పై ఏసీబీ తప్పుడు కేసు నమోదు చేసిందని కేటీఆర్ లాయర్ ఆర్యమా సుందరం కోర్టుకు తెలిపారు. 14 నెలల తర్వాత కేసు నమోదు చేయడంలోనే రాజకీయ కుట్ర అని అర్థమవుతుంది.. కరప్షన్ జరగనప్పుడు పీసీ యాక్ట్ కేటీఆర్ కు ఎలా వర్తిస్తుందని లాయర్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో స్పాన్సర్ వెనక్కి జరిగినప్పుడు.. ఈవెంట్ నిర్వహించకపోతే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఈ నిర్ణయం జరిగిందని లాయర్ తెలిపారు. ఈ ఏడాది 2024లో ఖచ్చితంగా నిర్వహించాలనే ఈ చెల్లింపులు జరిగాయి.. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ద్వారా హైదరాబాద్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.700 కోట్ల లాభం జరిగిందని లాయర్ పేర్కొన్నారు.
Read Also: Janaki vs State of Kerala: తెలుగులోకి మరో ఇంట్రెస్టింగ్ కోర్టు రూమ్ డ్రామా
కాంగ్రెస్ ప్రభుత్వం FEO కు మిగతా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిందని లాయర్ చెప్పారు. 2023 అక్టోబర్‌లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే FEOకి చెల్లించారన్నారు. అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందని అన్నారు. పబ్లిక్ సర్వెంట్ నేర పూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలి.. కానీ ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో క్రిమినల్ మిస్ కాండక్ట్ నేర (పూరిత దుష్ప్రవర్తన) ఎక్కడ జరగలేదన్నారు. 13(1)a, 409 అనే సెక్షన్‌లు వర్తించవని కేటీఆర్ లాయర్ తెలిపారు.