రాష్ట్రంలో మంత్రి పదవి ఆశించిన నేతలకు వైసీపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. జిల్లా అధ్యక్షులు మీరే.. పార్టీ బాధ్యతలు మీవే.. నడిపించేది.. గెలిపించేది మీరే అనే క్లారిటీ ఇచ్చారు. మంత్రులకంటే మీరే ఎక్కువ అని కూడా సాక్షాత్తూ సీఎం చెప్పారు కూడా. అయితే ఇది పదవి అనుకోవాలా.. లేక కొత్త సమస్యలు తలకెత్తుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో పడ్డారు పార్టీ పదవుల్లోకి వచ్చిన నేతలు. కొందరు నాయకులు మాత్రం తమ ముందున్న సవాళ్లను లెక్క చేయకుండా ఉత్సాహంగా […]
అనంతపురం టీడీపీలో నేతల స్టైలే వేరు. రాజకీయ ప్రత్యర్థులను వదిలేసి.. తమలో తామే పాలిటిక్స్‌ను రక్తికట్టిస్తారు. ఈ జాబితాలో టాప్‌లో ఉంటున్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తనకు సంబంధం లేకుండా పుట్టపర్తిలో ఎలా పర్యటిస్తారని జేసీని పల్లె ప్రశ్నిస్తుంటే.. కార్యకర్తలలో భరోసా నింపడానికే వెళ్లానని బదులిస్తున్నారు ప్రభాకర్‌రెడ్డి. ఒక ప్రైవేటు స్థలంపై సాగుతున్న వివాదం.. అనంత టీడీపీలో కలకలం రేపుతోంది. అక్రమాలు నిగ్గు […]
సంగారెడ్డి జిల్లా ఆందోల్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ.. మాజీ మంత్రి.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న బాబూమోహన్ ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. వేర్వేరు పార్టీలకు చెందిన ఈ ఇద్దరు నాయకులు.. పుల్కల్ మండలంలోని పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనలకు వచ్చారు. కలిసి రాకపోయినా.. ఇక్కడకి వచ్చాక కలిసి ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నారు. పార్టీల మధ్య ఉన్న వైరం నేతల మధ్య కనిపించకపోయినా.. […]
TJR సుధాకర్‌బాబు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి YCP MLAగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో.. మొదట్లో ఎమ్మెల్యేకు లోకల్ పార్టీ కేడర్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు కనిపించినా.. తర్వాత గ్యాప్ వచ్చేసింది. నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు, చీమకుర్తి మండలాల్లో ఈ గ్యాప్ మరీ ఎక్కువగా ఉందట. ఈ అంశాన్ని గుర్తించినా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదట సుధాకర్‌బాబు. దాంతో విభేదాలు కోల్డ్‌వార్‌గా మారిపోయినట్టు టాక్. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు […]
కాంగ్రెస్‌కు మరోసారి శక్తిని నింపేలా రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో పార్టీ చింతన్ శిబిర్ మేధోమథనం చాలా అంశాలను టచ్ చేసింది. అందులో చర్చకు వచ్చిన వాటిల్లో హాట్ టాపిక్‌గా మారింది మాత్రం.. పార్టీ నాయకుల కుటుంబంలో ఒకరికే టికెట్. దీనిపై పార్టీ చీఫ్ సోనియాగాంధీనే నిర్ణయం ప్రకటించారు. మేడమ్ ఆ మాట చెప్పినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లకు గుబులు పట్టుకుందట. వచ్చే ఎన్నికల్లో తాము పోటీచేయడంతోపాటు మరోచోటు నుంచి వారసులను లేదా కుటుంబ సభ్యులను బరిలో […]
రాజకీయాల్లో గ్రూపులు కామన్. కానీ గ్రూపుల కోసమే రాజకీయాలు నడపడం అనకాపల్లి స్పెషల్. ఇక్కడ వైసీపీలో మూడు ప్రధాన గ్రూపులు ఉన్నాయి. గత ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. ఎంపీ భీశెట్టి సత్యవతి. మాజీమంత్రి దాడి వీరభద్రరావు కుటుంబానికి కూడా అనకాపల్లి రాజకీయాలతో 3 దశాబ్దాల అనుబంధం ఉంది. ఇటీవల మంత్రిగా ప్రమోషన్ కొట్టేశారు అమర్నాథ్. ఆ తర్వాత నియోజకవర్గంపై మంత్రి అనుచరుల పట్టు పెరిగింది. గ్రూప్ రాజకీయాల్లో కొత్త హుషారు మొదలైంది. […]
చక్కటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి సామాజిక మాధ్యమాలు. వివాహ బంధాలను బలహీనపరిచి.. భర్తను భార్య.. భార్యను భర్త.. అతి కిరాతకంగా హత్య చేయిస్తున్నారు. సంసారాల్లోకి చొచ్చుకొస్తున్న సోషల్ మీడియా కనీవినీ ఎరుగని దారుణాలకు దారి వేస్తోంది. ఫేస్బుక్.. వాట్సాప్.. ఇన్స్టాగ్రామ్.. ట్విటర్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వీటి వినియోగం చాలా ఎక్కువ. భావస్వేచ్ఛా ప్రకటనకు ఈ సామాజిక మాధ్యమాలు తొలినాళ్లలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. కానీ.. అవే వేదికలు ఇప్పుడు దారుణమైన నేరాలకు.. నేర ప్రవృత్తికి బాటలు […]
తెలంగాణ కాంగ్రెస్ మరో కొత్త సంప్రదాయానికి తెర తీయాలని చూస్తోంది. రాహుల్ గాంధీతో జరిగిన సమావేశం మొదలుకొని…ఇటీవల హైదరాబాద్ పర్యటనలో కూడా టికెట్ల కేటాయింపుపై ఒకే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆఖరి వరకు కాకుండా…అరు నెల్ల ముందే అభ్యర్థుల ప్రకటన ఉండాలని చర్చకు పెట్టారు నేతలు. మార్చిలో ఢిల్లీలో జరిగిన సమావేశం లో కూడా సీనియర్ నేతలకు కూడా క్లారిటీ ఇచ్చారు రాహుల్. ఐతే టికెట్ల కేటాయింపులో ప్రామాణికం ఏంటనే చర్చ మొదలైంది కాంగ్రెస్‌లో. రాహుల్ గాంధీ […]
మంత్రి వర్గ విస్తరణలో అవకాశం దక్కకనినేతల అసంతృప్తి ఇంకా చల్లారినట్టు కనిపంచడంలేదు.. ముఖ్యంగా పశ్చిమగోదావరిజిల్లా నేతల్లో అసంతృప్తి సెగ పొగలుగక్కుతోంది. చాపకింద నీరులా వ్యాపించి ఓట్లేసిన జనంలో దృష్టిలో చులకన చేస్తోంది. తాజాగా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వ్యవహరంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. భీమవరంలో వైసీపీ జిల్లా పార్టీ మీటింగ్ రసాభాసగా మారడం మంత్రి వర్గవిస్తరణలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు చోటు దక్కకపోవడం ఎంతటి అసంతృప్తిని మిగిల్చిందో బయటపెట్టింది. పార్టీని మరింత […]
బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కు వ్యతిరేఖవర్గం ఈమధ్య యాక్టివిటీ బాగా పెంచేసిందంటా..చోటా మోటా లీడర్లను ముందు పెట్టి టికెట్ ఆశించే నేతలు పెద్ద గేమ్ మొదలెట్టారన్న చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా పలానా అభివృద్ది లేదా మంజూరు మాజీ ఎంపీ వల్లనే అయిందంటూ పోస్టులు టిఆర్ఎస్ పార్టీ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుండగా, ఎమ్మెల్యే వర్గం దానికి కౌంటరిస్తోంది. అంతేకాదు ఫోటోలు ,దానికింద ఇంత మ్యాటర్ సైతం పెట్టేస్తున్నారు. ఇలాంటివన్నీ అక్కడ నిత్యకృత్యమే. బోథ్ […]