సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ మూవీపై.. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు,యావత్ భారతీయ సినీ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలు, ఊహకు అందని విజువల్స్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇటీవల గ్రాండ్‌గా టైటిల్ లాంచ్ చేసుకొని, పాన్ వరల్డ్ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ సినిమా క్రేజ్ అంచెలంచెలుగా పెరుగుతోంది. అయితే, ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకి ఈ మూవీ గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది..
Also Read : Samantha: నా జీవితాన్ని నువ్వెంత మార్చావో నీక్కూడా తెలియదు.. సామ్ ఎమోషనల్
ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ మరియు ‘శ్రీరాముని’ పాత్రలో కనిపిస్తారనే సమాచారం అప్పుడే బయటకు వచ్చిన. తాజాగా సినీ వర్గాల్లో మరో సంచలన టాక్ బలంగా వినిపిస్తోంది. అదేమిటంటే, ఈ ‘వారణాసి’ చిత్రంలో మహేష్ బాబు ఏకంగా మొత్తం ఐదు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించబోతున్నారట. అంటే, ఇప్పటికే రివీల్ అయిన రెండు లుక్స్‌తో పాటు, సినిమాలో మరో మూడు డిఫరెంట్ లుక్స్ కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. రాజమౌళి గత చిత్రాలలో హీరోల ట్రాన్స్‌ఫర్మేషన్స్ చూస్తే, ఈ ఐదు అవతారాల కథనం నిజమైతే, అభిమానులకి అది కచ్చితంగా పండగలాంటిదే. జక్కన్న మాస్టర్ ప్లాన్ ప్రకారం మహేష్‌ను ఇంతకుముందెన్నడూ చూడని రీతిలో, విజువల్ వండర్‌గా చూపించనున్నారని తెలుస్తోంది. ఈ ఐదు అవతారాల గురించి మరింత స్పష్టత, అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.