విజయనగరం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి. అలాంటి చోట టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఎవరి నోట విన్నా ఆ మహిళా నేతలే పేర్లే చర్చల్లో ఉంటున్నాయి. విజయనగరంపై పట్టుకోసం అదితి గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గట్టిగా పోటీ పడుతున్నారు. 2019 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి ఉంది. 2019లో సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతను కాదని.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ ఇచ్చారు. […]
మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు. అప్పట్లో టీడీపీ అధినేత ఎన్టీఆర్, చంద్రబాబులకు కుడిభుజంగా పేరుతెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పొలిటికల్ తెరపై మండవ పేరు పెద్దగా వినిపించలేదు. కొన్నాళ్లు రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. మొన్నటి లోక్‌సభ ఎన్నికల ముందు గులాబీ కండువా కప్పుకొన్నారు. సీఎం కేసీఆర్ నేరుగా మండవ ఇంటికి వెళ్లి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. రాజకీయంగా పాత పరిచయాలు.. స్నేహం ఉండటంతో సైకిల్ దిగి.. కారెక్కేశారు మండవ. ఆ సమయంలోనే […]
కోనసీమ జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మాజీ మంత్రి కుడుపూడి చిట్టాబ్బాయి వర్థంతి సభలో జరిగిన పరిణామాల తర్వాత రాజకీయం వాడీవాడీగా ఉంది. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన అధికారపార్టీలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం రకరకాల మలుపులు తిరుగుతోంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎదుట మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మోకాళ్లపై కూర్చుని కృతజ్ఞతలు తెలియజేయడం మంత్రి సొంత సామాజికవర్గానికి చెందిన కొందరికి రుచించలేదు. వైసీపీలోనే ఉన్న ఆ […]
బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య. తెలుగు రాష్ట్రాల్లోని వెనకబడిన తరగతులకు.. రాజకీయ పార్టీలకు ఆయన సుపరిచితం. అలాంటి నాయకుడు ఒక్కసారిగా ఏపీ, తెలంగాణలో చర్చగా మారారు. దానికి కారణం ఆయన్ను రాజ్యసభకు వైసీపీ ఎంపిక చేయడమే. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఆర్ కృష్ణయ్యకు ఇస్తారనే చర్చ జరుగుతున్న సమయంలోనే ఆయన తాడేపల్లిలో కనిపించారు. వైసీపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీసీల సంక్షేమం .. హక్కుల సాధన కోసం […]
ఏపీలో మూడేళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పెద్ద కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం. ఈ రెండేళ్లూ పార్టీతోపాటు నేతలు ప్రజల్లోనే ఉండేలా ప్రొగ్రామ్‌ను నిర్దేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఇంటింటికీ తిరిగి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే నెలకు పది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో తిరగాల్సి ఉంటుంది. ఒక్కో సచివాలయ పరిధిలో రెండు రోజులు పర్యటించాలి. వలంటీర్లతోపాటు.. సచివాలయ సిబ్బంది వారి వెంటే ఉండాలి. అధినేత ఆదేశించగానే మెజారిటీ […]
బూతులు మాట్లాడితేనే నేతలవుతారా?అధినేతల మెప్పుకోసం అంతగా దిగజారాలా?తెలుగు రాష్ట్రాల్లో నేతల తీరు ఇలా ఎందుకు తయారైంది?రేపటి తరానికి ఇవాళ లీడర్లు ఏం మెసేజ్ ఇస్తున్నారు? భ్రష్టు పట్టిపోయిన రాజకీయ వ్యవస్థలు సమాజానికి ఏం మేలు చేస్తాయి?చట్ట సభల్లో మాటలు అదుపు తప్పితే జనం నోట మంచిమాటలెలా వస్తాయి? అడ్డూ అదుపు లేకుండా పోతోంది.ఏం మాట్లాడుతున్నారో, ఏం ట్వీట్ చేస్తున్నారో సోయి లేకుండా పోతోంది. ఎలాపడితే అలా నోరుజారుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నేత అయితే చాలు.. ఎంత మాట […]
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు కీలకపాత్ర పోషించాయి. అందులో ప్రభుత్వ డాక్టర్ల సంఘాలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యులు తమ దృష్టంతా రాజకీయాలపై పెడుతున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఉద్యమ సమయంలో ఏర్పాటైన సంఘం పేరును వాడుకునే విషయంలో రెండు గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది. పోలీసు కేసులు.. కోర్టులో విచారణ వరకు వెళ్లింది సమస్య. పైగా ఒకరిపై మరొకరు పదేపదే ఫిర్యాదులు చేసుకుంటూ శాఖాధిపతులకు కొరకరాని కొయ్యగా మారారు వైద్యులు. డ్యూటీలపై ఫోకస్ పెట్టకుండా […]
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎప్పుడూ పొలిటికల్ హీట్‌తో.. గ్రూపు రాజకీయాలతో రచ్చరచ్చగా ఉంటుంది. నిత్యం ఏదో ఒక రగడ ఇక్కడ కామన్. ఇలాంటి క్రమంలో రాజకీయాల్లో ఒకరు ఒక అడుగు ముందుకు వేస్తే.. మనం పది అడుగు వేయలనే ఆలోచనలో టీడీపీ ఇంఛార్జ్ గాలి భాను ప్రకాష్ వ్యూహం మార్చారట. మొన్నటిదాకా సైలెంట్‌గా చక్రం తిప్పిన ఆయన.. రోజాకు మంత్రి పదవి వచ్చాక ప్లాన్ బీ అమలులోకి తెచ్చారట. జిల్లా టీడీపీ నేతలంతా సైలెంట్ మోడ్‌లో […]
కాంగ్రెస్‌లో పి. జనార్దన్‌రెడ్డి వారసుడిగా విష్ణువర్దన్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. పీజేఆర్ మరణంతో జరిగిన ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు విష్ణు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి మరోసారి అసెంబ్లీకిలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికలు విష్ణుకు కలిసిరాలేదనే చెప్పాలి. 2014 మూడోస్థానంలో నిలిచిన ఈ యువనేత.. 2018లో మళ్లీ పుంజుకున్నా.. రెండోస్థానానికే పరిమితం అయ్యారు. రెండు వరస ఓటములు కుంగదీశాయో ఏమో.. తర్వాత […]
తెలంగాణ బీజేపీలో ఉన్న అంతర్గత ఆధిపత్య పోరుకు పార్టీ అగ్రనేత అమిత్ షా చెక్ పెట్టినట్టేనని తాజా టాక్. పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌కే హైకమాండ్ అండ అని తుక్కుగూడ సభలో షా క్లారిటీ ఇవ్వడంతో.. కాషాయ శిబిరంలో అలజడి మొదలైందట. బహిరంగ సభ నుంచే పార్టీ నేతలకు.. శ్రేణులకు షా స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఆ అంశాలపైనే వాడీవేడీ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు బీజేపీ సీనియర్లకు బీపీ ఎక్కువైందట. బండి […]