ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉన్నా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాన పార్టీలలో హడావిడి మొదలైంది. సీట్ల మార్పులు చేర్పులపై చర్చలు జోరందుకున్నాయి. ఈ తరహా చర్చలు టీడీపీలో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ప్రత్యేకించి సీనియర్లలో చాలా టెన్షన్ కనిపిస్తోందట. దశాబ్దాలుగా టీడీపీలో ఉంటూ పదవులు పొందిన నాయకుల సీటుకే ప్రస్తుతం ఎసరు వచ్చినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయట. దానికి తగ్గట్టుగానే అధినేత చంద్రబాబు కామెంట్స్ ఉంటున్నాయట. ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్లు.. చంద్రబాబుతోపాటు.. […]
తెలంగాణలో వరసగా మూడోసారి అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ టికెట్ దక్కించుకుంటే.. గెలుపు ఈజీ అనే ఆలోచనలో ఉన్నారు ఆశావహులు. ఇప్పటికే కొందరు నాయకులు నియోజకవర్గాలపై కర్చీఫ్‌లు వేసే పనిలో బిజీ అయ్యారు. గతంలో ఒకసారి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించి.. వివిధ కారణాలతో ప్రస్తుతం మరో పదవిలో ఉన్నవారు.. తిరిగి పట్టు సాధించే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో స్వయంగా బరిలో దిగాలని చూస్తున్నారట. వీలుకాకపోతే కుటుంబసభ్యులకైనా టికెట్ ఇప్పించుకోవాలనే ఆలోచనతో […]
ఆదిమూలపు సురేష్. ఏపీ మంత్రివర్గంలో రెండోసారి చోటు దక్కించుకున్న ఆయన ప్రస్తుతం మునిసిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. ప్రస్తుతం సొంత నియోజకవర్గంలోనే వైసీపీ కార్యకర్తలు మంత్రికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో కొందరికే ప్రాధాన్యం ఇవ్వటంతో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆయన తొలిసారి మంత్రి అయ్యాక జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పుల్లలచెరువు ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. […]
లంకకు నిప్పంటుకుంది. దేశం రణరంగంగా మారింది. ఆర్థిక సంక్షోభాన్ని తాళలేక జనంలో నెలకు పైగా నెలకొన్న ఆగ్రహావేశాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారుల దాడితో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఆగ్రహించిన జనం దేశవ్యాప్తంగా రోడ్లపైకొచ్చారు. ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ మద్దతుదారులపై దాడులకు దిగారు. ఇప్పటిదాకా తమకు తిరుగులేదనుకున్న రాజకపక్సేలకు.. జనం పవరేంటో తెలిసొచ్చింది. శ్రీలంకలో కర్ఫ్యూ పెట్టినా.. ఎమర్జెన్సీ విధించినా నిరసనకారులు తగ్గడం లేదు. అధికార పార్టీ నేతల్ని వెంటపడి […]
డీకే ఆదికేశవులు…మాజీ ఎంపీ .. టీటీడీ మాజీ ఛైర్మన్. చిత్తూరు జిల్లాలో వ్యాపార పరంగా, రాజకీయంగాను పెద్ద కుటుంబం. ఆర్థికంగానూ బలమైన ఫ్యామిలీ. చిత్తూరుతోపాటు జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో డీకే కుటుంబానికి పట్టు ఉండేది. 2004లో టిడిపి తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసిన ఆదికేశవులు.. తర్వాత కాంగ్రెస్‌లో చేరి TTD ఛైర్మన్ అయ్యారు. డీకే శ్రీనివాసులు 2009లో పీఆర్పీ తరపున రాజంపేట లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత డీకే కుటుంబం మరోసారి టీడీపీకి చేరువైంది. […]
టీడీపీకి గతంలో కంచుకోటగా ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లా.. ప్రస్తుతం మంచుకోటగా మారి.. క్రమంగా పార్టీ ఉనికి కోల్పోతున్న దుస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను గంపగుత్తగా వైసీపీ కైవశం చేసుకున్నప్పుడే ఈ విషయం తేటతెల్లమైంది. అప్పటితో పని అయిపోయిందని అనుకున్నారో.. పార్టీకి ఊపిరి లూదడం తమకు సంబంధం లేదని భావించారో ఏమో ప్రస్తుతం నాయకులతోపాటు పార్టీ కూడా పొలిటికల్ తెరపై నుంచి కననుమరుగయ్యే ప్రమాదం దాపురించింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ […]
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనలో టచ్ మీ నాట్‌గా కనిపించినట్టు పార్టీ వర్గాలు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నాయట. వాస్తవానికి కాంగ్రెస్‌లో రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి తర్వాతే ఎవరైనా. కానీ రాహుల్ గాంధీ టూర్ మొదటిరోజు.. ఠాగూర్ కాస్త దూరం అన్నట్టుగా ఉన్నారని టాక్. సాధారణంగా రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వస్తే.. రిసీవ్ చేసుకునే వారిలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ముందు ఉంటారు. కానీ రాహుల్ […]
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. మాజీ ఎంపీ. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానంతో 2013లో గులాబీ కండువా కప్పుకొన్న విశ్వేశ్వర్‌రెడ్డి.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నాటకీయ పరిణామాల మధ్య టీఆర్ఎస్కు రాజీనామ చేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగినా 13వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోనూ ఉక్కపోత ఫీలయ్యారు విశ్వేశ్వర్‌రెడ్డి. 2021 మార్చిలో హస్తంపార్టీకి […]
ఏపీలో జిల్లాల పునర్విభజన తర్వాత నరసాపురం పార్లమెంట్ పరిధి పశ్చిమగోదావరి జిల్లాగా మారింది. కాకపోతే జిల్లా కేంద్రంగా నరసాపురానికి బదులు భీమవరాన్ని చేశారు. ఇదే నరసాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరని చిచ్చుగా మారింది. వివిధ పార్టీల నాయకులు.. ప్రజా సంఘాలు JACగా ఏర్పడి నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమించాయి. అప్పట్లో ఈ సెగ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు గట్టిగానే తగిలింది. సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం […]
గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు.. పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. టీడీపీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఇప్పుడు ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందనగా యాక్టివ్ పాలిటిక్స్ ప్రారంభించారు ఈ మాజీ మంత్రి. కానీ.. ఆయన వేస్తున్న అడుగులకు.. క్రియాశీలకంగా మారేందుకు చేస్తున్న ప్రయత్నాలకు టీడీపీలోని ప్రత్యర్థులు చెక్ పెడుతున్నారు. దీంతో గంటా ప్రతీ కదలిక ఆసక్తిగా మారుతోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర నుంచి బాదుడే.. బాదుడు నిరసన టూర్ చేపట్టారు. విశాఖ […]