Alluri Agency: అల్లూరి ఏజెన్సీలో మావోయిస్టుల బ్యానర్లు కలకలం సృష్టించాయి. చాలా ఏళ్ల తరువాత ఏజెన్సీలో మావోయిస్టు బ్యానర్లు వెళిశాయి. హిడ్మాకు నివాళులర్పిస్తూ బ్యానర్లు దర్శనమిచ్చాయి.. ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయతీ కుమ్మిపుట్టు గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పక్కన చెట్టుకు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు నివాళులర్పిస్తూ బ్యానర్లు దర్శనమిచ్చాయి. “అమరవీరుల హిడ్మాకు జోహార్లు.. ఓ వీరుల నువ్వు కన్న కల దోపిడి లేని స్వేచ్ఛ దేశం నువ్వు పోరాడిన సాయుధ పోరాటం ప్రజల గుండెల్లో చరిత్ర లేఖలాగా ఉంటుంది.” అని
1.హెడ్మా. 2.మడకం రాజ్ అనే మావోయిస్టుల పేర్లను అందులో పేర్కొన్నారు. కానీ.. ఈ బ్యానర్లు ఎవరి పేరు మీద విడుదల చేశారో అందులో రాయలేదు.
READ MORE: Varanasi : జక్కన్న మాస్టర్ ప్లాన్ రివీల్..మహేష్ బాబు ‘వారణాసి’లో మొత్తం 5 అవతారాలు?
ఇదిలా ఉండగా.. గత వారం మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మావోయిస్టు కీలక నేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. తాము పోలీసులకు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని క్లారిటీ ఇచ్చారు.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ చెప్పారనేది అవాస్తవమని తెలిపారు. హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణమని మండిపడ్డారు. కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ హిడ్మా హత్యకు కారకులని తెలిపారు. అక్టోబరు 27వ తేదీన చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారని పేర్కొన్నారు. అనంతరం హిడ్మాను పోలీసులు పట్టుకుని ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు. ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతోనే 13 మందిని పట్టుకొని హత్య చేశారని విమర్శించారు.