Suryapet: సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు.. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి.. మృతుడు బీఆర్ఎస్ వార్డుమెంబర్ అభ్యర్థి మామ ఉప్పుల మల్లయ్యగా గుర్తించారు.. కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేయడంతో బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు.. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్ కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Pivotal eVTOL Aircraft: ఈ ఎగిరే కారును ఎవరైనా నడుపొచ్చు.. పైలట్ లైసెన్స్ అవసరం లేదు..
కాగా.. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 189 మండలాలు, 4,235 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు ఓటు హక్కు నియోగించుకోనున్నారు. అందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లు.. 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు.. 201 ఇతరులు ఉన్నారు. మొదటి విడతలో 37వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లోని గ్రామ పంచాయితీల్లో నిన్న (మంగళవారం) సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయింత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు బంద్ చేయనున్నారు. మొదటి విడతలో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.