Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • HYD BJP Meeting
  • Maharashtra Political Crisis
  • PM Modi AP Tour
  • Draupadi Murmu
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Off The Record Minister Appalaraju Self Stories Officials Are Getting Bored

YCP :మంత్రి సీదిరి అప్పలరాజు గారి సెల్ఫ్ డబ్బాపై అధికారులు లబోదిబో..!

Updated On - 01:15 PM, Thu - 19 May 22
By Sista Madhuri
YCP :మంత్రి సీదిరి అప్పలరాజు గారి సెల్ఫ్ డబ్బాపై అధికారులు లబోదిబో..!

సీదిరి అప్పలరాజు. కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి. ఇంఛార్జ్‌ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టాక.. జిల్లా సమావేశాలలో ఆయన తీరు ప్రశ్నగా మారింది. అధికారులను ఇరుకున పెడదామని ఆయన చేస్తున్న ప్రయత్నాలు చర్చగా మారుతున్నాయి. తాను స్పెషల్‌గా కనిపించాలనో ఏమో ప్రతి చిన్న విషయానికీ గంటల తరబడి సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారట. ఎవరైనా అధికారులు మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతుంటే.. ఐ నో ఎవ్రీథింగ్‌.. ప్లీజ్‌ సిట్‌ డౌన్‌.. అని ఇంగ్లీష్‌లో ఏకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. జవాబు చెప్పేందుకు కుర్చీలో నుంచి పైకిలేచిన ఆఫీసర్లు చిన్న బుచ్చుకుంటున్నారట. అడగడం ఎందుకు.. చెప్పేవరకు ఆగకుండా ఈ వన్‌మ్యాన్‌ షో ఏంటని బయటకొచ్చాక సెటైర్లు పేలుతున్నాయట. చివరకు అమాత్యులవారు చెప్పింది తప్పు అని తెలిశాక నాలుక కరుచుకుంటున్నారట. పైగా తన దగ్గర మిస్టేక్స్ జరగబోవని.. తాను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌ని అని చరిత్ర తవ్వుకు వస్తున్నారట. అక్కడితే ఆగితే బాగోదని అనుకుంటున్నారో ఏమో.. తాను గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నానని.. మీకు కుడా తెలిసే ఉంటుందని సమావేశంలో ఉన్నవారిని ఇన్వాల్వ్ చేస్తున్నారట అప్పలరాజు.

కాకినాడ గురించి తనకంతా తెలుసని.. ఇక్కడే చదువుకున్నానని హితబోధ చేస్తున్నారట మంత్రి అప్పలరాజు. జిల్లాలో క్రమశిక్షణ తప్పడం వల్లే.. జూనియర్‌ను అయినా తనకు సీఎం ఇక్కడ బాధ్యతలు అప్పగించారని గొప్పలకు పోతున్నారట. అయితే ప్రతి సమావేశంలోనూ ఈ సెల్ఫ్‌డబ్బా ఏంటి మహాప్రభో అని లబోదిబో మంటున్నారట అధికారులు. జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధుల్లో ఎక్కువమంది అప్పలరాజు కంటే రాజకీయాల్లో సీనియర్లే. ఒకరిద్దరు తప్ప అంతా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వాళ్లను కూడా మంత్రి లైట్ తీసుకుంటున్నారట. కొన్నిసార్లు సీనియర్లను ఏకవచనంతో పిలుస్తూ కామెడీ చేయాలని చూస్తున్నారట. దీంతో ఆ ప్రజాప్రతినిధులకు చిర్రెత్తికొస్తోందట.

ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. జిల్లాలో ప్రజాప్రతినిధులు స్కూల్ టీచర్లయితే.. తాను డీఈవో లాంటి వాడినని.. ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా అడిగే హక్కు తనకు ఉందని తనస్థాయి గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారట మంత్రి అప్పలరాజు. దీంతో ఇంఛార్జ్‌ మంత్రులుగా గతంలో చాలామందిని చూశామని.. కానీ ఇదెక్కడి గోల అని లోలోన మథన పడుతున్నారట. ఈ విషయాన్ని పైకి చెబితే ఒక తంటా.. చెప్పకపోతే మరో తంటాలా తయారైందని తమలో తామే సర్ది చెప్పుకుంటున్నారట. అప్పలరాజు మాత్రం రొటీన్‌గా తన స్టైల్లో తాను వెళ్తూ ఎస్టాబలీష్ కావడానికి అన్ని ప్రయత్నాలు చేయడం విశేషం. కొన్నిసార్లు కిందపడ్డా తనదే పైచెయ్యి అన్నట్టుగా మంత్రి తీరు ఉంటోందట. ప్రతి విషయంలోనూ శ్రీకాకుళంజిల్లాతో పోల్చుతూ.. అక్కడ అంతా అభివృద్ధి జరిగిందంటే తాను కూడా కారణమని చెబుతున్నారట మంత్రిగారు. కాకినాడ జిల్లాలో అంతా దానిని ఫాలోకావాలని సూచిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ కూడా అదే ఫార్ములా వర్కవుట్ చేస్తానని నొక్కి వక్కాణిస్తున్నారట అప్పలరాజు.

మొత్తానికి అప్పలరాజు ఏదో చేయబోయి. మరేదో చెప్తూ అడ్డంగా బుక్కైపోతున్నారు. అయినప్పటికీ తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా ముందుకెళ్తున్నారు అమాత్యులవారు. మరి.. ఈ విషయంలో ఇబ్బంది పడుతున్న జిల్లా ప్రజాప్రతినిధుల్లో ఎవరైనా ధైర్యం చేసి.. అప్పలరాజుకు చెబుతారో లేక పార్టీ పెద్దలతో చెప్పిస్తారో అని పార్టీ నేతలతోపాటు.. అధికారులు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నారు.

 

  • Tags
  • ap politics
  • Kakinada
  • Minister Appalaraju
  • ycp

RELATED ARTICLES

Sajjala Ramakrishnareddy: చంద్రబాబుది మాయా ప్రపంచం

TDP Mahanadu: గుడివాడలో టీడీపీ మహానాడు వాయిదా

Gudivada tension: ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు..గుడివాడలో టెన్షన్

YSRCP: అధికార పార్టీలో ఉన్న ఆ అన్నదమ్ములకు ఒకరంటే ఒకరికి గిట్టదా..?

Atmakur Bypoll: ఉప పోరులో విక్రమ్ రెడ్డి ఘనవిజయం

తాజావార్తలు

  • Mumbai Rain: ముంబైలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ

  • Plastic Ban: నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బంద్.. లేదంటే ఐదేళ్ల జైలు శిక్ష

  • President election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో 107 నామినేషన్ల తిరస్కరణ

  • TS TET 2022: నేడు టెట్ ఫ‌లితాలు..

  • Pakistan Economic Crisis: కరెంట్ కష్టాలు.. ఇంటర్నెట్ బంద్

ట్రెండింగ్‌

  • Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions