ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో మూడు కుటుంబాల నుంచి గతంలో ఇద్దరు చొప్పున పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి కుటుంబంలో పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రతాప్ పోటీ చేశారు. కోట్ల కుటుంబంలో కర్నూలు ఎంపీగా సూర్యప్రకాష్‌రెడ్డి, ఆలూరులో కోట్ల సుజాత బరిలో ఉన్నారు. భూమా ఫ్యామిలీ నుంచి ఆళ్లగడ్డలో అఖిలప్రియ, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి ఎన్నికల గోదాలోకి దిగారు. ఇప్పుడు ఈ కుటుంబాల నుంచి వచ్చే […]
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం. ఇక్కడి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. టీఆర్ఎస్ నుంచి వరసగా రెండోసారి ఎమ్మెల్యే. 2014లో గెలిచిన తర్వాత పెద్దగా వివాదాలు రాకపోయినా.. 2018లో గెలిచాక మాత్రం పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయని కేడర్ చెవులు కొరుక్కుంటోంది. టీఆర్ఎస్ కేడర్‌తోపాటు.. ప్రజలకు ఎమ్మెల్యే దూరం అయ్యారని టాక్ నడుస్తోంది. సొంత పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా భాస్కరరావు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మొదటి టర్మ్‌లో భాస్కరరావుకు తోడుగా ఆయన […]
శ్రీకాకుళం జిల్లా నుంచి రాజకీయ యాత్రలు ప్రారంభిస్తే తిరుగే ఉండదని భావిస్తాయి పొలిటికల్ పార్టీలు. తాజాగా వైసీపీ తమ మంత్రులతో చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కూడా అదేకోవలోకి వస్తుంది. పైగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 90 శాతం మంది బడుగు బలహీన వర్గాల వారే. అధికారపార్టీ కూడా ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా భావించడంతో.. అంతే అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయంలో సిక్కోలు వైసీపీ నేతలు బాధ్యతలు తీసుకుంటారని లెక్కలేసుకున్నాయి పార్టీ వర్గాలు. అంతర్గత […]
బెజవాడలో ఇటీవల మెగా అభిమానులు నిర్వహించిన సమావేశం ఇది. ఒకప్పుడు ఫ్యాన్స్ మీటింగ్ అంటే.. చిరంజీవి చేపట్టే సేవా కార్యక్రమాలు.. సినిమాల చుట్టూ చర్చ జరిగేది. విజయవాడ సమావేశం మాత్రం పూర్తిగా రాజకీయ అజెండా చుట్టూ తిరిగింది. జనసేనాని పవన్ కల్యాణ్ కేంద్రంగా జరిగిన ప్రసంగాలు.. ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో చర్చగా మారాయి. పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడాలని.. అందుకోసం పనిచేయాలని మెగా అభిమానులు తేల్చేశారు. అయితే ఇది వాళ్లకు వాళ్లుగా చేసిన కామెంటా లేక ఎవరైనా […]
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో నేతల మధ్య వర్గపోరు.. అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందట. కాంగ్రెస్ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్‌రావు.. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. కార్యకర్తలు, నాయకులు రెండువర్గాలుగా విడిపోయారు. పార్టీ ఏదైనా కార్యక్రమాలకు పిలుపిస్తే.. ఎవరి దుకాణం వాళ్లదే. జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్‌గా ఉన్న మదన్మోహన్ ఎల్లారెడ్డి అసెంబ్లీపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకంగా ఒకవర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. […]
విజయనగరం.. విశాఖ జిల్లాలను కలుపుతూ ఉన్న నియోజకవర్గం శృంగవరపుకోట. ఇక్కడ వైసీపీలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వర్గీయుడైన రఘురాజును వెంటపెట్టుకుని తిరిగేవారు. ఇద్దరూ పాలునీళ్లు అన్నంతగా కలిసి కనిపించేవారు. రఘురాజు లేకుండా సీసీరోడ్డును కూడా ప్రారంభించేవారు కాదు ఎమ్మెల్యే. సమావేశాలకు వెళ్లితే రఘురాజు ఎక్కడా అని ఆరా తీసేవారు. చివరకు రాజుగారి అనుగ్రహం లేకపోతే ఎమ్మెల్యే దగ్గర పని జరగదనే ప్రచారం ఉండేది. అలాంటిది […]
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం వైసీపీ వర్గ విభేదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ఈస్థాయిలో ఎక్కడా వర్గపోరు లేదు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నవీన్ నిశ్చల్‌ను కాదని.. 2019లో మాజీ పోలీస్ అధికారి మహ్మద్ ఇక్బాల్‌కు టికెట్ ఇచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చిందని టాక్. బాలకృష్ణ చేతిలో ఇక్బాల్ ఓడినా.. తర్వాత ఆయన్ని ఎమ్మెల్సీని చేశారు. అప్పటి నుంచి హిందూపురంలో ఇక్బాల్ పెత్తనం పెరిగడం.. నవీన్ వర్గానికి అస్సలు రుచించడం […]