Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Off The Record Did The Tdp Strategy Work In Dhone Discussion Going On At That Party

TDP : డోన్ లో టీడీపీ వ్యూహం ఫలించిందా..? ఆ పార్టీలో జరుగుతన్న చర్చేంటి..?

Published Date :May 26, 2022 , 11:47 am
By Premchand Chowdary
TDP : డోన్ లో టీడీపీ వ్యూహం ఫలించిందా..? ఆ పార్టీలో జరుగుతన్న చర్చేంటి..?
  • Follow Us :

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన రొటీన్‌కు భిన్నంగా సాగింది. కర్నూలు సమావేశంలో పార్టీ కేడర్‌ స్పందన, రోడ్ షోలకు లభించిన ఆదరణకు ఫుల్‌ ఖుషీ అయ్యి కీలక ప్రకటన చేశారు. డోన్‌ అభ్యర్థిగా సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు. బాబు నోటి వెంట ఈ ప్రకటన రాగానే పార్టీ శ్రేణులు నివ్వెర పోయాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్థిని ప్రకటించిన ఉదంతాలు లేకపోవడంతో అది చర్చగా మారింది. దీని వెనక టీడీపీ వ్యూహం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

డోన్‌లో టీడీపీ ఇంచార్జ్‌గా సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టాక కేఈ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కరపత్రాలు వేయడం.. నిరసనలు తెలియజేయడం కలకలం రేపింది. కేఈ కుటుంబానికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్స్‌ వినిపించాయి. ఆ ఎపిసోడ్‌లో పార్టీ అధిష్ఠానం కేఈ వర్గానికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ఆ గందరగోళానికి తెరదించడానికే డోన్‌ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారని అనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో డోన్‌లో కేఈ కుటుంబం పోటీ చేస్తుందని కొందరు.. కోట్ల కుటుంబం నుంచి బరిలో ఉంటారని మరికొందరు రకరకాలుగా ప్రచారంచేశారు. చర్చలు పెట్టారు. అలాంటి వాటన్నింటికీ సుబ్బారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి చెక్‌ పెట్టారని భావిస్తున్నారు.

డోన్‌ అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇవ్వడం ద్వారా పార్టీ నేతలు చంద్రబాబు మరో మెసేజ్‌ పంపారని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనలో ఒత్తిళ్లకు తలొగ్గబోమని, పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పడం కూడా అందులో భాగమని టీడీపీలో చర్చ జరుగుతోందట. సుబ్బారెడ్డి జైలుకు వెళ్లి వచ్చారని.. పార్టీ కోసం గట్టిగా పోరాడుతున్నారని చంద్రబాబు వేదికపైనే చెప్పారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావిస్తూ పార్టీ కోసం వెనక్కి తగ్గడం లేదని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన భయపడలేదని తెలిపారు. ఈ రెండు ఉదాహరణల ద్వారా కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నవారిని అక్కున చేర్చుకుంటామని చెప్పకనే చెప్పేశారు. పైగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత ఊరు బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో 6 వార్డులను టీడీపీ దక్కించుకోవడం వెనక సుబ్బారెడ్డి పాత్రను గుర్తించారు. అందుకే డోన్‌ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించారని విశ్లేషిస్తున్నారట.

డోన్ టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు కానీ.. ఇకపై నియోజకవర్గంలో పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది. డోన్‌లో బాగా పట్టున్న కేఈ వర్గం సుబ్బారెడ్డికి సహకరిస్తుందా.. లేక అసంతృప్తిని కొనసాగిస్తుందా అనేది అంతుచిక్కడం లేదట. అలాగే కోట్ల కుటుంబానికి కూడా నియోజకవర్గంలో పట్టుంది. ఈ రెండు కుటుంబాల తీరు వచ్చే ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి.. డోన్‌లో చంద్రబాబు ఎత్తుగడ వర్కవుట్‌ అవుతుందో లేదో చూడాలి.

 

  • Tags
  • Buggana Rajendranath Reddy
  • Chandra babu
  • Kurnool
  • Subba Reddy
  • tdp

WEB STORIES

కూరలో కరివేపాకు అని తీసి పారేయకండి.. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

"కూరలో కరివేపాకు అని తీసి పారేయకండి.. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.."

Lemon Leaves: నిమ్మ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?

"Lemon Leaves: నిమ్మ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?"

చికెన్ తినడం వల్ల గర్భిణులకు బోలెడు లాభాలు..

"చికెన్ తినడం వల్ల గర్భిణులకు బోలెడు లాభాలు.."

Nani:దసరా కన్నా ముందు నాని ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలుసా..?

"Nani:దసరా కన్నా ముందు నాని ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలుసా..?"

ద్రాక్ష పండ్లు తినడం మిస్ అవుతున్నారా.. అయితే ఇక అంతే సంగతి..

"ద్రాక్ష పండ్లు తినడం మిస్ అవుతున్నారా.. అయితే ఇక అంతే సంగతి.."

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్లు వీరే..

"ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్లు వీరే.."

2023లో భారత్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు వీరే..

"2023లో భారత్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు వీరే.."

భార్యాభర్తల మధ్య రొమాన్స్ తగ్గిందా..? అయితే ఇలా చేయండి..!

"భార్యాభర్తల మధ్య రొమాన్స్ తగ్గిందా..? అయితే ఇలా చేయండి..!"

ఇండియాలో ప్రముఖమైన 8 రకాల బిర్యానీలు ఇవే..

"ఇండియాలో ప్రముఖమైన 8 రకాల బిర్యానీలు ఇవే.."

Heaviest Animals: ప్రపంచంలోనే భారీ కాయం గల 10 జంతువులు

"Heaviest Animals: ప్రపంచంలోనే భారీ కాయం గల 10 జంతువులు"

RELATED ARTICLES

Off The Record: ఒంటరిపోరే శరణ్యమా?

Harirama Jogaiah: ఇలా చేస్తే ఐదేళ్లు పవన్‌ కల్యాణే సీఎంగా ఉంటారు..!

Somu Veerraju: ప్లాన్‌ ప్రకారమే దాడి.. ఇది పిరికి చర్య..

Tension in Puttaparthi: పుట్టపర్తిలో టెన్షన్‌.. టెన్షన్‌..

Off The Record: అక్కడ నేతలకు నిద్ర కరువే

తాజావార్తలు

  • LSG vs DC : 50 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం

  • LSG vs DC : 10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ స్కోర్‌ ఇలా

  • Roti: పొరపాటున కూడా చపాతీని డైరెక్ట్ గ్యాస్‌పై కాల్చకండి..

  • Killers of the Flower Moon: లియోనార్డో – మార్టిన్ అంత ‘పెద్దది’ చేశారా!?

  • Salaar: సలార్ ఓవర్సీస్ హక్కులు.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

ట్రెండింగ్‌

  • YouTube Village : యూట్యూబర్ల గ్రామం.. ఎక్కడ ఉందో తెలిస్తే షాక్ అవుతారు..

  • Expensive Apartment : భారత్ లోనే ఖరీదైన అపార్ట్‌మెంట్

  • IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions