నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. ఇదీ గవర్నర్ తమిళిసై మాట.. మహిళా దర్బార్ నిర్వహించిన గవర్నర్, తెలంగాణ సర్కారుకు…రాజ్ భవన్ కు మధ్య పోరుని కొత్త మలుపు తిప్పారు. ఒక సోదరిలా తెలంగాణ మహిళలకు అండగా ఉంటానని చెప్పిన గవర్నర్, గ్యాంగ్ రేప్ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. మహిళా దర్బార్ పై రాజకీయ వర్గాల్లో భిన్న స్పందనలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య వార్ […]
గుత్త సుఖేందర్‌రెడ్డి. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్. ఈయనేమో కంచర్ల భూపాల్‌రెడ్డి. నల్లగొండ ఎమ్మెల్యే. ఇద్దరూ టీఆర్ఎస్ నాయకులే. కానీ.. ఒకరంటే ఒకరికి పడదు. చాలా గ్యాప్ ఉందనేది గులాబీ శ్రేణులు చెప్పేమాట. ఒకరిపేరు మరొకరు వినడానికి.. పలకడానికి.. చివరకు ఎదురుపడటానికీ ఇష్టపడరని చెబుతారు. ఆ మధ్య నల్లగొండ నియోజకవర్గంలోని ప్రముఖ ఆలయానికి మండలి ఛైర్మన్ గుత్తా వెళ్తే.. ఆలయ ఈవో, అర్చకులు కనీసం ప్రొటోకాల్ పాటించలేదట. అదంతా ఎమ్మెల్యే ఆదేశాలతోనే జరిగిందనేది గుత్తా వర్గీయుల ఆరోపణ. అక్కడ […]
ఉమ్మడి కడప జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. YS ప్రభంజనంలో చతికిలపడ్డ తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా కోలుకోలేదు. నాడు వైఎస్ చేతిలో.. రెండు దఫాలుగా జగన్ చేతిలో ఓడి.. షెడ్డుకు చేరింది సైకిల్. అప్పట్లో అధికారంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క సీటు గెల్చుకోలేకపోయింది టీడీపీ. 2004లో ప్రొద్దుటూరులో లింగారెడ్డి ఒక్కరే గెలిచారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ కేడర్ ఎక్కడికక్కడ సర్దుకుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కీలక పదవులు వెలగబెట్టిన వారంతా అధికారం దూరం […]
తెలంగాణ మహిళా కాంగ్రెస్‌లో గొడవలు చినికి చినికి గాలి వానాలా మారిపోయాయి. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తీరే వివాదాలకు కారణమన్నది కొందరి వాదన. ప్రశ్నించినా.. చెప్పిన పని చేయకపోయినా వారిని వెంటనే పార్టీ నుంచి బయటకు పంపేస్తున్నారట. ఇటీవల మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగితే… ఓ రేంజ్లో రసాభాస అయ్యింది. దుర్భాషలాడారనే అభియోగాలతో మహిళా కాంగ్రెస్ సిటీ అధ్యక్షురాలు పదవి నుంచి కవితామహేష్ను తప్పించారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయన్నది గాంధీభవన్ వర్గాల టాక్. మహిళా […]
ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజకీయ వైరం పీక్స్‌కు చేరుకుంది. ఇటీవల వెల్లడైన పదోతరగతి ఫలితాలపైనా రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్ధులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు టీడీపీ నేత నారా లోకేష్. అయితే టీడీపీ పొలిటికల్ స్క్రీన్‌పై వైసీపీ నేతలు ప్రత్యక్షం కావడంతో రచ్చ రచ్చ అయింది. టీడీపీ అంటే ఒంటికాలిపై లేచే మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ నుంచి గెలిచి.. […]
ఎన్నికల షెడ్యులు విడుదల కావడంతో ప్రజలు, పార్టీల దృష్టి కాబోయే రాష్ట్రపతి అభ్యర్థిపై పడింది. ఈ ఎన్నికల ద్వారా జాతీయస్థాయిలో రాజకీయ పరిణామాలు ఏలా మారతాయి? ఏ కూటమి నుంచి ఎవరు అభ్యర్ధిగా బరిలో దిగుతారో అనేదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి తమ అభ్యర్ధి గెలుపు కోసం లెక్కలతో కుస్తీ పడుతోంది. పలు పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు బీజేపీ ముఖ్యనేతలు. అయితే NDAకు వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో ఎవరు ఉంటారు? […]
కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తీస్తున్న సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కార్తిక్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ‘రాజావారి రాణిగారు, ఎస్.ఆర్ కళ్యాణమండపం’ సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటకు చక్కటి స్పందన వచ్చింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ […]