CNAP India: ఇకపై దేశంలో ఫోన్ నంబర్ సేవ్ చేయాల్సిన రోజులు పోయాయి. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో ఇప్పటికే ఒక మ్యాజిక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదే కాలర్-ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (Caller Name Presentation – CNAP). భారతదేశంలో అన్ని కాల్స్‌కు KYC-ధృవీకరించిన పేర్లను కేంద్రం దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా టెలికాం ఆపరేటర్లు భారతీయ మొబైల్ నంబర్‌లను ఉపయోగించే ప్రతి కాలర్ యొక్క ధృవీకరించిన పేరును వినియోగదారులకు చూపించాల్సి ఉంటుంది. దీనిని ముందుగా హర్యానాలో పైలట్ ప్రాజెక్ట్‌గా పరీక్షించారు. తర్వాత ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు.
REDA ALSO: Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
దేశంలో వాయిస్ కాల్స్‌లో పెరుగుతున్న ఫిషింగ్, ఆర్థిక, మోసపూరిత నెట్‌వర్క్‌ల కారణంగా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. టెలికాం కంపెనీలు కొన్నిసార్లు అనుమానాస్పద నంబర్లను లేబుల్ చేస్తూనే ఉన్నప్పటికీ, ఇకపై CNAP ఈ హెచ్చరికలను ధృవీకరించిన పేర్లతో భర్తీ చేస్తుంది. దీంతో ఫోన్ కాల్స్ చేసే వారిలో నిజమైన వారు ఎవరు, నకిలీ కాల్స్ చేసే వారు ఎవరు అనేది గుర్తించడం సులువు అవుతుంది.
CNAP ప్రత్యేకత
ఇది వినియోగదారుల డేటాపై ఆధారపడిన కాలర్-ఐడెంటిఫికేషన్ యాప్‌ల లాగా కాదు. CNAP కేవలం టెలికాం ఆపరేటర్లు ధృవీకరించిన KYC డాక్యుమెంటేషన్ ఆధారంగా పనిచేస్తుంది. టెలికాం నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఇది మొబైల్ కమ్యూనికేషన్‌లో కచ్చితమైన గుర్తింపు అందిస్తుంది. ఈ విధమైన సిస్టమ్‌లను ఖతార్ వంటి కొన్ని దేశాలు కార్పొరేట్ లైన్‌ల కోసం ఉపయోగిస్తున్నాయి. కానీ భారత్ ఈ సేవలను దేశవ్యాప్తంగా మొత్తం మొబైల్ వినియోగదారులను కవర్ చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ఇకపై మీ ఫోన్‌కు ఎవరైనా కొత్త వ్యక్తులు ఫోన్ చేస్తే వారి నెంబర్ మీ దగ్గర సేవ్ చేసి లేకపోయినా ఇప్పటి నుంచి వారి పేరు మీకు కనిపిస్తుంది.
REDA ALSO: New Regional Alliance: భారత్‌పై కుట్రకు ప్లాన్ చేస్తున్న పాక్.. డ్రాగన్‌తో కొత్త కూటమికి సన్నాహాలు