TDP : ఆ ఎపిసోడ్ లో టీడీపీ, వైసీపీ సాధించిందేంటి.? ఎవరికీ కలిసొచ్చింది.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజకీయ వైరం పీక్స్‌కు చేరుకుంది. ఇటీవల వెల్లడైన పదోతరగతి ఫలితాలపైనా రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్ధులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు టీడీపీ నేత నారా లోకేష్. అయితే టీడీపీ పొలిటికల్ స్క్రీన్‌పై వైసీపీ నేతలు ప్రత్యక్షం కావడంతో రచ్చ రచ్చ అయింది. టీడీపీ అంటే ఒంటికాలిపై లేచే మాజీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ నుంచి గెలిచి.. వైసీపీకి జైకొట్టిన వల్లభనేని వంశీతోపాటు.. మరికొందరు అధికారపార్టీ నాయకులు ఆ లాగిన్‌లో కనిపించారు. రోజంతా ఈ ఎపిసోడ్‌పై హైడ్రామా నడిచింది. అయితే ఈ రచ్చ ఎవరికి కలిసొచ్చింది అన్నదే ప్రశ్న.
వైసీపీ ఒక పద్దతి లేకుండా చేసిందనేది టీడీపీ ఆరోపణ. సీరియస్ అంశాన్ని నాన్ సీరియస్‌గా తీసుకుని అధికారపార్టీ పరువు పోగొట్టుకుందని టీడీపీ ఆరోపించింది. జూమ్ మీటింగ్‌లో కాదు.. నేరుగా వస్తే చర్చించడానికి రెడీ అన్నారు లోకేష్. ఈ క్రమంలో టీడీపీ మద్దతుగా అచ్చెన్నాయుడు మొదులకొని పలువురు తెలుగుదేశం నాయకులు మాటల తూటాలు పేల్చారు. అయితే ఈ విషయంలో వైసీపీ వాదన మరోలా ఉంది. పదో తరగతి ఫలితాలను రాజకీయం చేయాలని చూసిన టీడీపీ ప్రయత్నాన్ని సక్సెస్ ఫుల్‌గా అడ్డుకున్నామన్నది అధికారపార్టీ నేతల వాదన. జూమ్ మీటింగ్‌లో తమతో చర్చించకుండా.. భయపడి లోకేష్ పారిపోయారని విమర్శ వేడి పెంచారు. పరీక్షా ఫలితాలను పొలిటికలైజ్ చేస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్సూ ఇచ్చారు.
Also Read
అయితే ఈ ఎపిసోడ్‌లో విద్యార్థుల తల్లిదండ్రుల వాదన ఇంకోలా ఉంది. పిల్లల భవిష్యత్‌కు సంబంధించిన అంశంలో రాజకీయ గోల ఏంటన్నది వారి ప్రశ్న. కానీ.. టీడీపీ, వైసీపీ నేతల మాటల దాడిలో వారి వాయిస్‌కు బలం లేకుండా పోయింది. రోజంతా రాజకీయ చర్చ.. రచ్చకే సమయం సరిపోయింది. ఈ రగడలో మరో వాదన కూడా వినిపిస్తోంది. లోకేష్ చేపట్టిన జూమ్ మీటింగ్ గురించి ముందే తెలుసుకున్న వైసీపీలోని ఒక సీనియర్ నేత స్కెచ్ వేశారట. విద్యార్థులతోపాటు జూమ్ ద్వారా మీటింగ్‌లో పాల్గొని.. లోకేష్ వాదనేంటో విని ప్రభుత్వ విధానాన్ని చెప్పాలని అనుకున్నారట. ఆ వెనువెంటనే కొడాలి నాని, వల్లభనేని వంశీతోపాటు ఇతర నేతలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. కొందరు విద్యార్థులను వారే ఎంపిక చేశారట. పైగా టీడీపీ వేదికగా.. పార్టీ జెండాలు పట్టుకుని లోకేష్ జూమ్ మీటింగ్‌లోకి రావడంతో వైసీపీ మరింత అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. మీటింగ్ ప్రారంభమైన కాసేపటికే మా అంకుల్ అన్నయ్యలు మాట్లాడతారని విద్యార్థులు కొడాలి నాని, వల్లభనేని వంశీలకు మైకులు అందజేశారు. మొత్తానికి ఈ ప్లాన్‌ను వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా తమ వంతు సహకారం అందించిందట.
తాజావార్తలు
-
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్‌తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!