రెండు వేవ్ లు సృష్టించిన విధ్వంసం ప్రపంచం ఇంకా మర్చిపోలేదు..ఒమిక్రాన్ చడీ చప్పుడు లేకుండా దాటిపోయినా, ఇంకా కరోనా భయం పోలేదు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మళ్లీ వైరస్ వ్యాప్తి పెరిగింది. దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. లేటెస్ట్గా కొత్త కేసులు 8 వేలకు పైగా రిపోర్ట్ అయ్యాయి. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలను దాటేసింది. శుక్రవారం దాదాపు మూడున్నర లక్షలమందికి టెస్టులు చేస్తే, అందులో 8,329 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. […]
తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా గవర్నర్ తమిళి సై నిర్వహించిన మహిళా దర్బార్‌పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మహిళా దర్బార్ని స్వాగతించారు. అంతేకాదు… రాష్ట్రంలో గవర్నర్ పాలన పెట్టినా బాగుంటుందన్నారు రేవంత్. తెలంగాణ ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి ఎవరు లేనప్పుడు కనీసం గవర్నర్ అయినా వింటే మంచిదే కదా అన్నారాయన. ఇంత వరకు బాగానే ఉన్నా… పార్టీ వర్కింగ్ […]
అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూపల్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి… హస్తానికి హ్యాండిచ్చి… కారు ఎక్కేశారు. దీంత కొల్లాపూర్ టిఆర్ఎస్లో అగ్గి రాజుకుంది. తాజా, మాజీ […]
తెలంగాణ BJP అనుబంధ విభాగాలు ఉన్నాయి. ఈ అనుబంధ మోర్చా లన్నింటికి కమిటీలు కూడా ఉన్నాయి. యువజన మోర్చ, మహిళా, కిసాన్, దళిత, గిరిజన, OBC, మైనార్టీ మోర్చా లు BJPకి ప్రధాన అనుబంధ విభాగాలు. అయితే… ఇందులో కొన్ని మోర్చాలు తమ పరిధిలో జరుగుతున్న వ్యవహారాన్ని అస్సలు పట్టించుకోవడం లేదట. పార్టీ చెప్పేంత వరకు కనీసం స్పందించడం లేదట. తాము ఉన్నామని చెప్పుకునేందుకు ఏదో పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలు అప్పడప్పుడు చేస్తున్నారని లోకల్ టాక్. ప్రధానంగా […]
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం విచిత్రమైన పరిస్ధితిని ఎదుర్కోంటోంది. గత ఎన్నికల్లో 11 స్ధానాలను గెలుచుకోగా… రెబల్ ఎమ్మెల్యే చేరికతో ఆ సంఖ్య పన్నెండుకు పెరిగింది. సంస్ధాగతంగా పార్టీ పటిష్టతకు, జిల్లా అభివృద్ధికి బాటలు వేసుకునే అవకాశం లభించింది. మంత్రివర్గ పునర్విభజన తర్వాత జిల్లాకు రెండు కీలకమైన పోర్ట్ ఫోలియోలు లభించాయి. గ్రామీణ అభివృద్ధి, ప్రజలతో నేరుగా సంబంధాలు వుండే మంత్రిత్వ శాఖలు కావడంతో నాయకత్వంలోనూ కొత్త ఆశలు చిగురించాయి. కానీ… క్షేత్ర స్ధాయిలో […]
కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీ గ్రూపు తగాదాలు రోడ్డున పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి మధ్య గత కొంత కాలంగా ఉన్న విబేధాలు బయటపడ్డాయి. తన ఎంపీ ఫండ్స్‌తో ముస్లిం శ్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి పనులు చూడటానికి వెళ్తున్న బాలశౌరిని… పేర్ని నాని అనుచరుడు అడ్డుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఎంపీ వస్తే పేర్ని నాని వర్గం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని బాల శౌరీకి ముందే […]