ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గత నెల 11న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పిలుపిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గ పరిధిలోని ఒక్కో గ్రామ, వార్డు సచివాలయాన్ని రెండురోజులపాటు సందర్శించాలి. నెలలో పది సచివాలయాలకు వెళ్లాలని శాసనసభ్యులకు సీఎం జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ సచివాలయాల పరిధిలో ఉండే కుటుంబాల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల లేఖను అందజేయాలి. వారిని అడిగి పథకాలు అందుతున్నయో లేదో నిర్ధారించుకోవాలని చెప్పారు. సమస్యలు ఉంటే […]
బీజేపీలో రాష్ట్ర కమిటీ కంటే పవర్ ఫుల్ కోర్ కమిటీ. ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన నాయకులతో ఆ కమిటీని ఏర్పాటు చేస్తుంది జాతీయ నాయకత్వం. ఇందులో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కూడా ఉంటారు. అయితే తెలంగాణలో విస్తరించాలని.. అధికారంలోకి రావాలని చూస్తోన్న కమలనాథులు.. కోర్ కమిటీ ఏర్పాటు ఊసే ఎత్తడం లేదు. దీనిపై మాట్లాడేవారు .. ప్రశ్నించేవారూ కూడా కరువయ్యారు. ప్రధాని మోడీ.. అమిత్ షా, జేపీ నడ్డా వంటి అగ్రనేతలు తెలంగాణకు వచ్చి […]
తెలంగాణలో కామ్రేడ్లు సైలెంట్ అయ్యారు. సమస్యలున్నా కనిపించడం లేదు. ఒకప్పుడు విద్యుత్ పోరాటంలో కాల్పుల వరకు లెఫ్ట్ పార్టీల ఉద్యమం ఎగిసిపడింది. అలాంటి వామపక్ష నేతలకు ఏమైంది అన్నదే ప్రస్తుతం ప్రశ్న. నిత్యావసరాల ధరాలు భారీగా పెరిగాయి. పెట్రోధరలు భగ్గుమంటున్నాయి. ఆర్టీసీలో ఛార్జీల మోత మోగుతోంది. విద్యుత్ ఛార్జీలు షాక్ కొడుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎర్ర జెండాలతో రోడ్డెక్కి ధర్నాలు.. రాస్తారోకోలు.. ప్రభుత్వ ఆఫీసుల ముట్టడితో హోరెత్తించేవి.. CPI, CPM ఇతర వామపక్ష పార్టీలు. […]
సోము వీర్రాజు. ఏపీ బీజేపీ చీఫ్. కోనసీమలో పర్యటనలో భాగంగా అమలాపురం వెళ్దామని అనుకున్నారు. కానీ.. అక్కడ అల్లర్లు జరగడంతో బయట ప్రాంతాల వారిని రానివ్వడం లేదు. సెక్షన్ 30తోపాటు సెక్షన్ 144 అమలులో ఉన్నాయి. దాంతో ఆయన్ని జొన్నాడ దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. అయితే బీజేపీకి చెందిన మహిళా నేత తల్లి చనిపోతే పరామర్శకు వెళ్తున్నానన్నది వీర్రాజు చెబుతున్న రీజన్. ఇక్కడే మరో అంశం కూడా ప్రచారంలో ఉంది. అమలాపురానికి చెందిన బీజేపీ నేత బాలయ్య […]
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అంతేకాదు… హిందీలోనూ ‘రామ్ సేతు’ లాంటి చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ నెల 17న అతను నటించిన ‘గాడ్సే’ మూవీ విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే సరిగ్గా దానికి ఒక నెలలోనే సత్యదేవ్ మరో సినిమా ‘గుర్తుందా శీతాకాలం’ రాబోతోంది. ఈ సినిమాను జూలై 15న విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు గురువారం తెలిపారు. కన్నడ చిత్రం ‘లవ్ మాక్ టైల్’ కు ఇది రీమేక్. […]
తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా ? ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలు.. ఆ దిశగా ముందుకు వెళ్తున్నాయా ? విపక్ష నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత ? అసలు ఎందుకు ఈ రకమైన ప్రచారం జరుగుతోంది ? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ రాజకీయ వాతావరణ వేడెక్కింది. అన్ని పార్టీలు తమ పాలిటిక్స్‌ను యాక్టివ్ మోడ్‌లోకి మార్చేశాయి. ముందస్తు ఎన్నికల ప్రచారాలతో ఈ వాతావరణం మరింత […]