24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
- Caviar సంస్థ Legends Collectionను విడుదల..
- Scarface, The Godfather, Joker చిత్రాల పాత్రల నుంచి స్ఫూర్తి
- ప్రతి ఫోన్‌పై 24 క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్‌తో పాటు చేతితో చేసిన Hot Cloisonné Enamel ఆర్ట్‌వర్క్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Caviar Smartphones: లగ్జరీ స్మార్ట్‌ఫోన్ కస్టమైజేషన్‌కు పేరుగాంచిన కావియర్ (Caviar) మరోసారి ప్రత్యేక ఎడిషన్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈసారి కంపెనీ Samsung Galaxy Z Fold 8, Galaxy Z Fold 8 Ultra ఆధారంగా రూపొందించిన లెజెండ్స్ కలెక్షన్ (Legends Collection)ను తీసుకవచ్చింది.
ఇందులో భాగంగా హాలీవుడ్‌లోని ప్రముఖ చిత్రాలు స్కార్ఫేస్, ది గాడ్‌ఫాదర్, జోకర్ (Scarface, The Godfather, Joker) పాత్రల నుంచి స్ఫూర్తి పొందిన ఈ ఫోన్లు 24 క్యారెట్ గోల్డ్ ఫినిష్, చేతితో చేసిన ఎనామెల్ ఆర్ట్‌వర్క్‌తో రూపొందించబడ్డాయి.ఈ కలెక్షన్స్ లో మొత్తం మూడు ప్రత్యేక ఎడిషన్లు ఉన్నాయి. ప్రతి ఫోన్ వెనుక భాగంలో సంప్రదాయ హాట్ క్లోయిసోనే ఎనామెల్ (Hot Cloisonné Enamel) జ్యువెలరీ టెక్నిక్‌తో చేతితో రూపొందించిన కళాత్మక డిజైన్‌ను ఉపయోగించారు. ఫోన్ ఫ్రేమ్, కెమెరా మాడ్యూల్, అంచులన్నింటికీ 24 క్యారెట్ బంగారు పూత వేశారు. ప్రతి డిజైన్‌ను కేవలం 19 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయడం విశేషంచేశారు.
Also Read
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!

Galaxy Z Fold 8 ఆధారంగా రూపొందించిన Scarface Editionలో ప్రముఖ పాత్ర Tony Montanaను తెల్లటి సూట్లో చూపించారు. వెనుక భాగంలో బంగారు గిల్లోషే (Guilloché) ప్యాటర్న్‌తో ప్రీమియం లుక్ ఇచ్చారు. మరో Galaxy Z Fold 8 ఆధారిత Godfather Editionలో Don Vito Corleone చిత్రాన్ని టక్సెడోలో చూపించారు. ఎరుపు గులాబీ, సినిమా గుర్తుగా నిలిచిన Marionette Strings డిజైన్‌ను బంగారు మెటల్వర్క్తో అందంగా మలిచారు. అలాగే ఈ సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్ Galaxy Z Fold 8 Ultra ఆధారంగా రూపొందించిన Joker Edition. ఇందులో పర్పుల్, గ్రీన్, బర్గండీ రంగుల ఎనామెల్‌తో జోకర్ చేతిలో ప్లేయింగ్ కార్డ్స్ పట్టుకుని ఉన్న డిజైన్‌ను రూపొందించారు. బ్యాక్ ప్యానెల్‌పై ప్రత్యేక జియోమెట్రిక్ ప్యాటర్న్ కూడా బాగుంది.

ఇక ధరల విషయానికి వస్తే.. Scarface Edition ప్రారంభ ధర 12,560 డాలర్లు (రూ.10.9 లక్షలు), The Godfather Edition ప్రారంభ ధర 12,560 డాలర్లు (రూ.10.9 లక్షలు), Joker Edition (Galaxy Z Fold 8 Ultra) ప్రారంభ ధర 12,990 డాలర్లు (రూ.11.3 లక్షలు) గా ఉన్నాయి. ఈ ధరలు 256GB స్టోరేజ్ వేరియంట్ వి. Legends Collectionలోని ప్రతి ఫోన్‌ను ప్రత్యేక ప్యాకేజింగ్‌లో అందిస్తున్నారు. బాక్స్‌లో 24 క్యారెట్ గోల్డ్-ప్లేటెడ్ కీను కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఈ లగ్జరీ స్మార్ట్ఫోన్ల కోసం కంపెనీ ఆర్డర్లను స్వీకరిస్తోంది.

తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!