GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR: సినీ తారలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తమ ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు GMB Cinemas, విజయ్ దేవరకొండ AVD Cinemas, మాస్ మహారాజా రవితేజ ART Cinemas పేర్లతో మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ప్రీమియం మల్టీప్లెక్స్ వెంచర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, సినీ వర్గాల్లో ఈ బజ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
“మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన ఫుట్‌ప్రింట్‌ను ప్రీమియం మల్టీప్లెక్స్ రంగంలోనూ విస్తరించబోతున్నారు” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ‘డ్రాగన్’ విషయానికి వస్తే.. సెన్సెషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై ఎన్టీఆర్ నుంచి గానీ, ఆయన టీమ్ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చూడాలి మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన ఎలా వస్తుందన్నది.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!