Vikram: మొదటి నుంచీ విక్రమ్ విలక్షణ నటనతోనే జనాన్ని అలరిస్తూ సాగుతున్నారు. 'చియాన్'గా తమిళ జనం మదిలో నిలచిన విక్రమ్ ఇప్పటికీ వైవిధ్యానికే పెద్ద పీట వేస్తున్నారు.
తెలుగు చిత్రసీమలో స్క్రీన్ ప్లే రాయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు ప్రముఖ దర్శకనిర్మాత కె.యస్.ప్రకాశరావు. ఆయన దర్శకత్వంలో రూపొందిన అనేక తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు. కె.యస్.ప్రకాశరావుతో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అనుబంధం ప్రత్యేకమైనది. వారిద్దరి కాంబినేషన్ లో “కన్నతల్లి, బందిపోటు దొంగలు, ప్రేమనగర్, సెక్రటరీ” వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఏయన్నార్ తో కె.యస్.ప్రకాశరావు రూపొందించిన తొలి చిత్రం ‘కన్నతల్లి’ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో […]
అసలు పేరు కనుమరుగై, కొసరుపేరే నిలచిపోయిన వారు ఎందరో చిత్రసీమలో ఉన్నారు. అంతెందుకు మన మెగాస్టార్ అసలు పేరు కొణిదెల శివశంకర ప్రసాద్. అలా పిలిస్తే చిరంజీవి అభిమానుల్లోనే కొందరు గుర్తుపట్టలేరు. అలాగే సినిమాలోని పాత్ర పేరునే ఇంటిపేరుగా చేసుకొని జనం ముందు నిలిచారు జేడీ చక్రవర్తి. ఆయన అసలు పేరు నాగులపాటి శ్రీనివాసచక్రవర్తి. ఆ పేరు చెబితే ఎవరూ గుర్తు పట్టలేరు. అదే జేడీ చక్రవర్తి అనగానే ఆయన తెరపై కనిపించిన తొలి చిత్రం ‘శివ’ను […]
NTR-ANR: మహానటులు నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్ ఇద్దరూ అన్నదమ్ముల్లా మెలిగారు. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఆ తరువాత కొన్ని విషయాల్లో మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలం వారి మధ్య మాట కూడా కరువయింది.
రచయిత,నటుడు గొల్లపూడి మారుతీరావు రాసిన అనేక రచనలు తెలుగు పాఠకలోకాన్ని ఆకట్టుకున్నాయి. ఇక చిత్రసీమలోనూ ఆయన మాటలు, కథలు భలేగా మురిపించాయి. మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటించిన “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాదికాదు ఆకలిది” వంటి సూపర్ హిట్ హిందీ రీమేక్ సినిమాలకు గొల్లపూడి మాటలు రాశారు. ఆ చిత్రాల షూటింగ్ సమయంలో యన్టీఆర్ కు అదేపనిగా డైలాగ్స్ నేరేట్ చేసేవారు గొల్లపూడి. రామారావును ఎంతగానో అభిమానించడం వల్ల ఆయన వాచకశైలిని ఉద్దేశించే […]
Ammalakkalu:'పాతాళభైరవి' ఘనవిజయం తరువాత మహానటుడు యన్టీఆర్ జైత్రయాత్ర ఆరంభమైంది. ఆ తరువాత ఆయన చిత్రాలు తెలుగు,తమిళ భాషల్లో రూపొందసాగాయి. 1951లో "పాతాళభైరవి, మల్లీశ్వరి", తరువాతి సంవత్సరం "పెళ్ళిచేసిచూడు, దాసి, పల్లెటూరు" చిత్రాల ఘనవిజయాలతో యన్టీఆర్ తీరే వేరుగా సాగుతూ ఉండేది. ఆయన తరువాతి చిత్రంగా 'అమ్మలక్కలు' రూపొందింది.
Millie Bobby Brown: అందాల భామ మిలీ బాబీ బ్రౌన్ ఈ యేడాది ఫిబ్రవరి 19తో పందొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుంది. అమ్మడు అప్పుడే పెళ్ళిపై మనసు పారేసుకుంది. రాక్ లెజెండ్ జోన్ బాన్ జోవీ కుమారుడు బాంజీయోవిని బాబీ పెళ్ళాడబోతోంది.
Allu Arha: ఒకరు పోషించిన పాత్రను మరొకరు పోషించడం అన్నది కొత్తేమీ కాదు. ఇప్పుడు సమంత నాయికగా గుణశేఖర్ రూపొందించిన 'శాకుంతలం' ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.
100Days Movie: ఒకప్పుడు సినిమాల విజయానికి సదరు చిత్రాలు శతదినోత్సవం ప్రదర్శితం కావడం కొలమానంగా ఉండేది. అంతకు మించి ఆడితే ఆ సినిమా మరెంతో విజయం సాధించిందని భావించేవారు. అయితే అప్పట్లో కొన్ని చిత్రాలు నిజాయితీగా ప్రదర్శితమయ్యేవి.