Millie Bobby Brown: అందాల భామ మిలీ బాబీ బ్రౌన్ ఈ యేడాది ఫిబ్రవరి 19తో పందొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుంది. అమ్మడు అప్పుడే పెళ్ళిపై మనసు పారేసుకుంది. రాక్ లెజెండ్ జోన్ బాన్ జోవీ కుమారుడు బాంజీయోవిని బాబీ పెళ్ళాడబోతోంది. వీరిద్దరూ మూడేళ్ళ నుంచీ మంచి ఫ్రెండ్స్. వారిద్దరూ కలసి ఉన్న ఫోటో, అందులో వెడ్డింగ్ రింగ్ కనిపిస్తూ ఉండటం, ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ – హారర్ డ్రామా సిరీస్ ‘లెవెన్’తో మిలీ బాబీ బ్రౌన్ జనం మదిని దోచింది. తరువాత ‘గాడ్జిల్లా’ సినిమాలతోనూ మిలీ బాబీ మంచి పేరు సంపాదించింది. తన మనసు దోచిన వాడితో అప్పుడే ఒక్కటవ్వడానికి మిలీ బాబీ బ్రౌన్ చూపిస్తున్న ఆరాటం చూసి హాలీవుడ్ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. మరీ ఇంత చిన్నవయసులో పెళ్ళా? ఈ బాల్య వివాహాన్ని ఆపండి! అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మిలీ బాబీ బ్రౌన్ కథ ఇలా ఉంటే, ఆమె టీనేజ్ లోనే పెళ్ళి చేసుకోబోతూ ఉండడంతో కొంతమంది టీనేజ్ మ్యారేజెస్ ను జనం గుర్తు చేసుకుంటున్నారు.
Allu Arha: యంగ్ టైగర్ @ 8… అల్లు అర్జున్ కూతురు @ 6…!
వారిలో అందరికన్నా ముందుగా మన డింపుల్ కపాడియాను జనం గుర్తు చేసుకోవడం విశేషం! డింపుల్ తన 16వ యేట 1973లో అప్పటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాను పెళ్ళాడింది. అందాల భామ దివ్యభారతి తన 18వ సంవత్సరంలో నిర్మాత సాజిద్ నడియడ్వాలాను 1992లో వివాహం చేసుకుంది. అమెరికన్ నటి కిమ్ కర్దాషియన్ తన 19వ యేట పెళ్ళాడింది. హాలీవుడ్ తార మిలా జోవోవిచ్ తన 16వ సంవత్సరంలో కోరుకున్నవాడితో కాపురం చేసింది. మెకావులే కల్కిన్ కూడా టీనేజ్ లోనే పెళ్ళిపీటలెక్కింది. అయితే ఆ తరువాత దివ్యభారతి మినహాయిస్తే వీరందరూ చిన్నవయసులోనే పెళ్ళాడి తప్పు చేశామని స్టేట్ మెంట్స్ ఇచ్చినవారే! మిలీ బాబీ బ్రౌన్ భవిష్యత్ లో తన రూటే సెపరేటు అని చాటుకుంటుందో, లేక వీరి జాబితాలోనే చేరుతుందో చూడాలి.