Dhakshina Murthy: ‘సంసారం సంసారం.. ప్రేమ సుధా తీరం.. నవజీవన సారం..’ అన్న మధురాన్ని 1950లో ‘సంసారం’ కోసం పలికించిన సుస్వరాల సుసర్ల దక్షిణా మూర్తి స్వరప్రయాణం తెలుగువారి మది పులకింపచేస్తూ సాగింది. గానకోకిల లతామంగేష్కర్ స్వరవిన్యాసాలను తెలుగులో తొలుత వినిపించిందీ ఆయనే. ‘సంతానం’లో లత పాడిన ‘నిదుర పోరా తమ్ముడా…’ గానం ఈ నాటికీ సంగీత ప్రియులను మురిపిస్తూనే ఉంది. ‘ఇలవేల్పు’ లోనూ ‘చల్లని రాజా ఓ చందమామ..’ పాటతో నిజంగానే ప్రేక్షకుల మదిలో చల్లని […]
Prabhas Eeshwar: అప్పటికే తెలుగు చిత్రసీమలో వారసుల హవా విశేషంగా వీస్తోంది. టాప్ ఫోర్‌లో ముగ్గురు సినిమా రంగానికి చెందిన వారసులే. తరువాతి తరం టాప్ స్టార్స్ లోనూ మహేష్, జూనియర్ ఎన్టీఆర్ వంటివారు అలరిస్తున్న సమయమది. తమ అభిమాన హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసునిగా ఆయన తమ్ముని తనయుడు ప్రభాస్ అరంగేట్రం చేస్తున్నారని తెలియగానే ఫ్యాన్స్ ఆనందంతో చిందులు వేశారు. ప్రభాస్ కు ‘యంగ్ రెబల్ స్టార్’ అంటూ టైటిల్ ఇచ్చేసి ఆయన మొదటి […]
Prabhas @ 20 Years: ‘బాహుబలి’గా భళారే అనిపించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటునిగా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఆయన తొలి చిత్రం ‘ఈశ్వర్’ నవంబర్ 11తో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. 2002 నవంబర్ 11న విడుదలైన ‘ఈశ్వర్’ చిత్రం ప్రభాస్ ను అభిమానుల మదిలో ‘యంగ్ రెబల్ స్టార్’గా నిలిపింది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా ప్రభాస్‌ను ఫ్యాన్స్ అదే తీరున ఆదరిస్తున్నారు. ఆయన జయాపజయాలతో నిమిత్తం లేకుండా ప్రభాస్ కు […]
Krish Jagarlamudi: దర్శకుడు క్రిష్ పేరు వింటే చాలు ఆయన తెరకెక్కించిన వైవిధ్యమైన చిత్రాలు మన మదిలో చిందులు వేస్తాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కిస్తున్నారు. జానపద చిత్రంగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ పార్టీ ‘జనసేన’ ఆశయాలు కూడా పొందుపరిచారని తెలుస్తోంది. దీంతో ఆ సినిమాపై పవన్ ఫ్యాన్స్ మరింత ఆసక్తి నెలకొంది. క్రిష్ అసలు పేరు జాగర్లమూడి రాధాకృష్ణ. ఆయన 1978 […]
Tatineni Ramarao: ఒకప్పుడు భారతీయ సినిమా అంటే హిందీ సినిమానే అనే తీరున వెలిగింది. ప్రస్తుతం హిందీ చిత్రసీమ టాలీవుడ్ వైపే ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఇప్పటి దర్శకుల దిగ్విజయాల కారణంగానే తెలుగు సినిమా రంగంవైపు హిందీవాళ్ళు దృష్టి కేంద్రీకరించారని నవతరం ప్రేక్షకులు పొరబడుతున్నారు. మన దర్శకులు, నటీనటుల కోసం ఉత్తరాదివారు ఆసక్తిగా ఎదురుచూసిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. అలా హిందీ చిత్రాలతో వెలుగు చూసిన తెలుగు దర్శకులు ఎందరో ఉన్నారు. వారిలో తాతినేని రామారావు ప్రత్యేక […]
TRP Rating: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ నటించిన 'విక్రమ్' బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అయితే ఘన విజయం సాధించిన ఈ సినిమా ఈ టీవీ ప్రీమియర్‌లో తక్కువ టిఆర్ పిని సాధించటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
Tollywood: థియేటర్ల సందడి బాగా తగ్గిందనే చెప్పాలి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే, టాక్ బాగున్నా, మునుపటిలా అన్ని కేంద్రాలలో వంద శాతం వసూళ్ళు కనిపించడం లేదు.