మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్టులను చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి, అఖిల్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన మైత్రి వారు ఇప్పుడు మెగా హీరోతో మరో ప్రాజెక్టుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో మైత్రి మూవీ మేకర్స్ రెండు ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ ‘ఉప్పెన’ను నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్. […]
సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ హీరోలుగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘శివప్పు ముంజల్ పచ్చై’ చిత్రం తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ హీరోయిన్లు గా నటించారు. తాజాగా ఈ చిత్రంలో నుంచి ‘ఆహ ఎవరిది’ అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. హీరోహీరోయిన్ల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ను ఆనంద్ అరవిందాక్షన్, యామిని ఘంటసాల ఆలపించగా… వెన్నెలకంటి లిరిక్స్ అందించారు. యూత్ […]
టాలీవుడ్ లో చాపకింద నీరులా విస్తరిస్తోంది గ్లామర్ డాల్ ఊర్వశీ రౌతేలా! తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘బ్లాక్ రోజ్’లో హీరోయిన్ గా నటిస్తున్న ఊర్వశీ రౌతేలా… గోపీచంద్ ‘సీటీమార్’లో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ సినిమాలు విడుదల కాకముందే… అమ్మడు మరో జాక్ పాట్ కొట్టినట్టు సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్ చేయబోతోందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ‘గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4’ […]
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ క్రేజీ ఫిల్మ్ రాబోతోంది. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ తన డెబ్యూ ప్రాజెక్ట్ గా నిర్మిస్తోంది. టాలీవుడ్ లో ఆసక్తి రేపిన ఈ ప్రెస్టీజియస్ సినిమాపై ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి. ఈ పుకార్లను చిత్ర నిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ ఖండించింది. ఇవన్నీ అవాస్తవాలని, విజయ్ దేవరకొండ – సుకుమార్ కాంబో సినిమా ముందుగా అనుకున్న ప్రకారమే […]
శంకర్ జోరు చూపిస్తున్నాడు. ఓ వైపు చరణ్ తో సినిమా పనులు కానిస్తూనే అప్పుడెపుడో తీసిన ‘అన్నియన్’ ని బాలీవుడ్ లో రణ్ వీర్ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయమై నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ చేసిన హెచ్చరికకు ప్రతిగా సవాల్ చేసిన శంకర్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ‘అపరిచితుడు’కి హీరోయిన్ ని కూడా సెట్ చేశాడట. ‘భరత్ అనే నేను’లో మహేశ్ కి జోడీగా నటించిన కియారా అద్వానినీని రణ్ వీర్ కి జోడీగా ఎంచుకున్నాడట. […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కరోనా నుండి కోలుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా శనివారం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సంతోషకరంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ, తనకు తాజా పరీక్షలో నెగెటివ్ వచ్చిందని తెలిపింది. తనపై అభిమానంతో ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ కత్రినా కైఫ్ ధన్యవాదాలు తెలిపింది. గత కొంతకాలంగా ఆమె విక్కీ కౌశల్ తో రిలేషన్ షిప్ లో ఉందనే గుసగుసలు బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్నాయి. […]
ప్రముఖ తమిళ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వివేక్ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణవార్తతో సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివేక్ ఆకస్మిక మృతి బాధాకరం అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు మోడీ “ప్రముఖ నటుడు వివేక్ అకాల మరణం చాలా మందిని బాధపెట్టింది. అతని కామెడీ టైమింగ్, ఇంటెలిజెంట్ డైలాగులు […]
ప్రముఖ బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్ ప్రకటించారు. ఈరోజు మార్నింగ్ కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, తాను ఆల్రెడీ క్వారంటైన్ లో ఉన్నానని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను అని సోషల్ మీడియాలో తెలిపారు సోనూసూద్. అంతేకాదు ‘మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు… దీనివల్ల మీ సమస్యలను తీర్చడానికి నాకు మరికొంత సమయం దొరుకుతుంది. […]
బుల్లితెర అందాల భామలు చాలామంది సీరియల్స్ లో సంస్కారవంతమైన కోడళ్ళుగా కనిపిస్తుంటారు. కానీ నిజజీవితంలో తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తుంటారు. లేట్ నైట్ పార్టీలకు వెళ్తారు, ఐలాండ్ బీచ్ లకు హాలీడే ట్రిప్స్ వేస్తుంటారు. తమ వెల్ టోన్డ్ బాడీ లోని కర్వ్స్ ను సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసి ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటారు. కానీ తాను అందుకు భిన్నం అని చెబుతోంది బుల్లితెర భామ దివ్యాంకా త్రిపాఠి. ‘బనూ మై దుల్హన్, యే […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం తుది షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుంది. దీంతో మొత్తం షూటింగ్ భాగం పూర్తవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పూజాహెగ్డే ఇటలీలోని ఒక విశ్వవిద్యాలయంలో మెడికోగా అంటే వైద్య విద్యార్ధి పాత్ర పోషిస్తోందట. కథ ప్రకారం చిన్న యాక్సిడెంట్ తరువాత అనుకోకుండా […]