బుల్లితెర అందాల భామలు చాలామంది సీరియల్స్ లో సంస్కారవంతమైన కోడళ్ళుగా కనిపిస్తుంటారు. కానీ నిజజీవితంలో తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తుంటారు. లేట్ నైట్ పార్టీలకు వెళ్తారు, ఐలాండ్ బీచ్ లకు హాలీడే ట్రిప్స్ వేస్తుంటారు. తమ వెల్ టోన్డ్ బాడీ లోని కర్వ్స్ ను సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసి ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటారు. కానీ తాను అందుకు భిన్నం అని చెబుతోంది బుల్లితెర భామ దివ్యాంకా త్రిపాఠి. ‘బనూ మై దుల్హన్, యే హై ముహాబతే’ వంటి సీరియల్స్ తో హౌస్ హోల్డ్ నేమ్ గా మారిపోయిన దివ్యాంక పలు వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తుంటుంది. ‘తోటి ఆర్టిస్టులు బికీనీ వేస్తూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతుంటే మీరు వాటికి దూరంగా ఉంటారేంటి?’ అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా దివ్యాంక ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ‘దానికి ఒకటే కారణం… ఆ విషయంలో నేను సిగ్గరిని. స్విమ్ సూట్ లేదా బికిని వేసుకోవడం అంటే నాకు సిగ్గు. అందువల్లే నేను స్విమ్మింగ్ కూడా నేర్చుకోలేదు. పైగా అలాంటి దుస్తులు ధరిస్తే నేను అస్సలు బాగానని నా నమ్మకం. ఒకవేళ అలాంటి దుస్తులు ధరించాలంటే… చాలా ధైర్యాన్ని నేను పోగేసుకోవాలి. నిజానికి ఆ ధైర్యం ఉండబట్టే ఎంతో మంది అందమైన అమ్మాయిలు బికీనీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండొచ్చు. నేను మాత్రం ఆ పని చేయలేను” అని చెప్పుకొచ్చింది.