యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం తుది షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుంది. దీంతో మొత్తం షూటింగ్ భాగం పూర్తవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పూజాహెగ్డే ఇటలీలోని ఒక విశ్వవిద్యాలయంలో మెడికోగా అంటే వైద్య విద్యార్ధి పాత్ర పోషిస్తోందట. కథ ప్రకారం చిన్న యాక్సిడెంట్ తరువాత అనుకోకుండా ప్రభాస్, పూజాహెగ్డే కలుసుకుంటారట. అప్పటినుంచి ఈ జంట మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా వెండితెరపై చూసేదాకా ఆగాల్సిందే. యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం నుంచి అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.