టాలీవుడ్ లో చాపకింద నీరులా విస్తరిస్తోంది గ్లామర్ డాల్ ఊర్వశీ రౌతేలా! తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘బ్లాక్ రోజ్’లో హీరోయిన్ గా నటిస్తున్న ఊర్వశీ రౌతేలా… గోపీచంద్ ‘సీటీమార్’లో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ సినిమాలు విడుదల కాకముందే… అమ్మడు మరో జాక్ పాట్ కొట్టినట్టు సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్ చేయబోతోందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ‘గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4’ చిత్రాలలో అందాలను ఆరబోసిన ఊర్వశీ రైతేలా సోషల్ మీడియాలోనూ తన ఫోటో ఫోటో షూట్స్ తో కుర్రకారు కంటిమీద కనుకు లేకుండా చేస్తుంటుంది. ప్రస్తుతం ఊర్వశీ రౌతేలా ‘వర్జిన్ భానుప్రియ’ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అలానే రణదీప్ హుడా సరసన ‘ఇన్ స్పెక్టర్ అవినాశ్’ మూవీలోనూ ఊర్వశీ రౌతేలా నటిస్తోంది. ఒకవేళ ‘పుష్ఫ’ చిత్రంలో ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్ చేయబోతున్న విషయం నిజమైతే మాత్రం అమ్మడి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. ఎందుకంటే… సుకుమార్ మూవీలో ఐటమ్ సాంగ్ అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే కదా!