కొన్ని కాంబినేషన్స్ భలేగా ఉంటాయి.. ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్‌లో కొన్ని ఊహించని కాంబోలు.. మల్టీ స్టారర్స్ సెట్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ.. యాంగ్రీమెన్ రాజశేఖర్ కలిసి నటించబోతున్నారనే క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. గతంలోనే ఇలాంటి వార్తలొచ్చినా.. ఇప్పుడు ఇది ఫిక్స్ అనే టాక్ నడుస్తోంది. ఇంతకీ బాలయ్య సినిమాలో రాజశేఖర్ పాత్రేంటి..!
చివరగా ‘అఖండ’తో భారీ సక్సెస్ అందుకున్న బాలయ్య.. అదే టైంలో ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోతో దుమ్ముదులిపారు. ఇప్పుడు అదే జోష్‌లో దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఎన్బీకే 107 ప్రాజెక్ట్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ హంట్ కూడా అదరహో అనేలా ఉంది. ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం ప్రీపొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా.. జులై మొదటి వారం నుంచి షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం.
ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తోంది. ఇక తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో రాజశేఖర్.. బాలయ్యకు విలన్‌గా నటించబోతున్నారని వినిపించింది. కానీ ఇప్పుడు బాలయ్య స్నేహితుడిగా, ఓ కామెడీ రోల్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈ మూవీలో యాంగ్రీమేన్.. తన ఒరిజినల్ వాయిస్‌తోనే.. ఫుల్ కామెడీ చేయబోతున్నారని తెలుస్తోంది. మామూలుగా అయితే.. రాజశేఖర్ సినిమాలకు సాయి కుమార్ వాయిస్ అందిస్తుంటారు. కానీ ఫస్ట్ టైం బాలయ్య సినిమాకు తన ఒరిజినల్ వాయిస్ ఇవ్వబోతున్నారట. అయితే.. ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ఈ న్యూస్ మాత్రం సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసేలా ఉంది.