అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో మరో డిఫరెంట్ షో మొదలైంది. శుక్రవారం నుండి అనిల్ రావిపూడి నేతృత్వంలో 'కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్' షో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరుగురు కామెడియన్స్ ఈ షో ద్వారా నవ్వుల విందు వడ్డిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన సినిమా 'విట్ నెస్'. మాన్యువల్ స్కావెంజింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ దీపక్ తెరకెక్కించారు.
డిసెంబర్ 9వ తేదీ చిన్న సినిమాలు వెల్లువెత్తబోతున్నాయి. ఇప్పటికే ఎనిమిది స్ట్రయిట్ సినిమాలతో పాటు రెండు కన్నడ అనువాద చిత్రాలూ వస్తుండగా, తాజాగా వీటితో అరుణ్ విజయ్ నటించిన తమిళ చిత్రం కూడా జత అయ్యింది. తమిళ చిత్రం 'సినం' తెలుగులో 'ఆక్రోశం' పేరుతో డబ్ అయ్యి 9వ తేదీ విడుదల కాబోతోంది.
ఇప్పటికే పలు తెలుగు చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన తనిష్క్ రాజన్ ఇప్పుడు 'నేనెవరు' మూవీలో నటిస్తోంది. డిసెంబర్ 2న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. రంగస్థలం నుండి సినిమాల్లోకి వచ్చిన తనిష్క్ ఈ సినిమాలోని పాత్ర తనకు గుర్తింపు తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.
'హను-మాన్' చిత్రం టీజర్ కు వచ్చిన స్పందనతో సంతోషించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, కథానాయకుడు తేజ సజ్జా ఆధ్యాత్మిక యాత్రకు ప్రయాణమయ్యారు. నిన్న వీరిరువురూ అయోధ్య కు వెళ్ళి రామ్ లలాను సందర్శించారు.
సత్యదేవ్, డాలీ ధనంజయ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. 'పెంగ్విన్' ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీని వేసవి కానుకగా ఐదు భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఇంతవరకూ కామెడీ పాత్రలు చేయని తాను తొలిసారి 'మట్టి కుస్తీ'లో ఆ తరహా పాత్ర చేశానని ఐశ్వర్య లక్ష్మీ చెబుతోంది. 'గాడ్సే', 'అమ్ము' చిత్రాలతో తెలుగువారికి చేరువైన ఐశ్వర్య లక్ష్మీ ఇప్పుడు 'మట్టి కుస్తీ'తో మరోసారి అలరించబోతోంది.
ఎస్తేర్ నొరోహా కీలక పాత్ర పోషించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'ఐరావతం'. గత రెండు వారాలుగా ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో టాప్ పొజిషన్ లో ఉండటం విశేషం.
కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'డెజావు'. విమర్శకుల ప్రశంసలూ అందుకున్న ఈ సినిమా తెలుగు వర్షన్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ చక్కని ఆదరణ పొందుతోంది.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. ఈ సినిమా టీజర్ చూసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిత్ర బృందాన్ని అభినందించారు.