ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన విక్టరీ వెంకటేశ్ 'నారప్ప' సినిమా ఇప్పుడు థియేటర్లో ప్రదర్శితం కాబోతోంది. వెంకటేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 13న రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ ఒక్క రోజు ఈ సినిమాను ప్రదర్శిస్తామని సురేశ్ బాబు తెలిపారు.
ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో కిరణ్ 'అహింస' పేరుతో సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే జనం ముందుకు రానుంది.
ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ చిత్రాలకు ఎడిటర్ అండ్ సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన ఎన్. శ్రీనివాసన్ 'ఎంతవారు గాని' పేరుతో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్ ను అడవి శేష్ విడుదల చేశారు.
పాతికేళ్ళ క్రితం తెలుగువారిని ఆకట్టుకున్న 'ప్రేమదేశం' చిత్రం ఇప్పుడు మరోసారి జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే... తాజాగా అదే పేరుతో మరో 'ప్రేమదేశం' తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు శుక్రవారమే విడుదల అవుతున్నాయి.
మిత్రుడు డి.వై చౌదరి తెరకెక్కిస్తున్న చిత్రం కోసం దర్శకుడు కె. దశరథ్ కథను అందించారు. అంతేకాదు... నిర్మాణ భాగస్వామిగానూ మారారు. డి.వై. చౌదరి డెబ్యూ మూవీ 'లవ్ యూ రామ్' ఫస్ట్ లుక్ పోస్టర్, థీమ్ వీడియో శనివారం విడుదలయ్యాయి.
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' మూవీ ఈ నెల 9న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా విడుదలైన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ చిత్రాన్ని నాగార్జున 'గీతాంజలి'తో పోల్చారు సత్యదేవ్!
యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ మూడో చిత్రం 'కీడా కోలా' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండో షెడ్యూల్ శనివారం మొదలైంది.
తమిళ హీరో అరుణ్ విజయ్ నటించిన రెండు చిత్రాలు డిసెంబర్ 9న తెలుగులో రాబోతున్నాయి. ఇందులోని 'ఆక్రోశం'లో అతను హీరోగా నటించగా, 'సివిల్ ఇంజనీర్'లో విలన్ పాత్ర పోషించాడు.